Wednesday, September 9, 2020

How to vote telugu biggboss



Read also:

 

బిగ్ బాస్ ఓటింగ్ - మిస్డ్ కాల్ నంబర్లు, ఓటింగ్ ప్రాసెస్ ఇలా, గంగవ్వ దూసుకుపోతుందిగా

తొలివారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఉన్నారు. మరి వీరికి ఓటు వేయడం ఎలా? హాట్ స్టార్, మిస్డ్ కాల్ నంబర్లు ఏమిటో చూద్దాం.

బిగ్ బాస్ ఆటలో అసలు మజా మొదలైంది. రెండో రోజునే హౌస్‌లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరి బ్యాగ్ సర్దేయడానికి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను షురూ చేశారు. సోమవారం నాడు జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు తొలివారం ఎలిమినేషన్‌ని నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురులో ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ నుంచి బ్యాగ్ సర్దేయనున్నారు.

అయితే ఈ ఏడుగురిలో తమ అభిమాన కంటెస్టెంట్‌కి ఓటు ఎలా వేయాలి? ఈసారి ఓటింగ్ విధానం ఎలా ఉంది? ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో అంటే సీజన్ 1, సీజన్ 2లకు 'గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌' ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. అయితే సీజన్ 3కి ఎలిమినేషన్‌‌కి చేపట్టే ఓటింగ్‌ ప్రక్రియను మార్చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని సీజన్ 4కి కూడా కొనసాగిస్తున్నారు.

వీటిలో ఒకటి హాట్ స్టార్ ద్వారా ఓట్ చేయడం.రెండోది మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయడం.


హాట్ స్టార్ ఓటింగ్ ఇలా.

  • ప్లే స్టోర్‌లోకి వెళ్లి హాట్ స్టార్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. 
  • అనంతరం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోగానే.
  • తెలుగుకి సంబంధించి హాట్ స్టార్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల లిస్ట్ వస్తుంది.
  • అందులో బిగ్ బాస్‌ను సెలెక్ట్ చేసుకోగానే.. అందులో లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్లే అవుతుంది.
  • ఆ కిందనే గ్రీన్ కలర్‌‌తో VOTE అని రాసి ఉంటుంది. 
  • VOTEని క్లిక్ చేయగానే.లాగిన్ ఎంటర్ చేయమని వస్తుంది. ఈ లాగిన్ ఫేస్ బుక్ లేదా మొబైన్ నంబర్ నుండి లాగిన్ కావొచ్చు.
  • లాగిన్ అయిన తరువాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఒక వేళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. సంబంధిత నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓ టీ పీ నంబర్‌ని ఎంటర్ చేసి.. పేరు, ఏజ్ మిగిలిన వివరాలు ఇచ్చి ఓకే చేయగాని కొత్తగా అకౌంట్ క్రియేట్ అవుతుంది. (ఒకవేళ మీరు ఇప్పటికే హాట్ స్టార్‌ యాప్‌ని ఉపయోగిస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఓట్ చేయవచ్చు)
  • అలా క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వారం ఎవరైతే ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారో వాళ్ళ ఫొటోలు కనిపిస్తాయి. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కు 10 ఓట్లను ఇవ్వొచ్చు. అలా కాకుండా ఈ పది ఓట్లను మనకు నచ్చినట్టుగా కూడా షేర్ చేయవచ్చు.
  • ఉదాహరణకు తొలివారం ఎలిమినేషన్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఉన్నారు.. వాళ్ల ఫొటోపై ఒక్కసారి క్లిక్ చేస్తే ఒక్క ఓటు పడుతుంది. రెండు సార్లు క్లిక్ చేస్తే రెండు ఓట్లు పడతాయి. ఓట్లను తమకు నచ్చినట్టు ఓట్లు డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఒకే కంటెస్టెంట్‌కి పది ఓట్లు వేయొచ్చు.. లేదంటూ పది ఓట్లను ఈ ఏడుగురికి డివైడ్ చేయొచ్చు. ఇలా రోజుకు ఒకసారి 10 ఓట్లను మాత్రమే వేయవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేసే విధానం.

  • డైరెక్ట్‌గా ఫోన్ చేసి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంది.
  • ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది.
  • ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేయొచ్చు.
  • రోజులో ఒక్కోనెంబర్ నుండి పది వరకూ ఓట్లు వేయొచ్చు.
  • ఈ ఓట్లను సర్దుబాటు చేసుకునే వీలుంది. అంటే ఉదాహరణకు తొలివారం ఎలిమినేషన్‌లో ఏడుగురు ఉన్నారు కనుక.ఏడుగురికి సర్దుబాటు చేసుకుని ఓట్లు వేయొచ్చు. 
  • పది ఓట్లు వేయాలంటే పది మిస్డ్ కాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే ఈ తొలివారంలో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఉండగా మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్లు ఈ విధంగా ఉన్నాయి.

అభిజిత్ – 8886658204

సూర్య కిరణ్ –8886658202

అఖిల్ సార్థక్ – 8886658215

దివి – 8886658214

మెహబూబ్ – 8886658206

సుజాత – 8886658205

గంగవ్వ – 8886658216

కాగా ప్రస్తుతం అన్ని ఆన్ లైన్ పోల్ ఓటింగ్ సరళి చూస్తూ యూట్యూబ్ సంచలనం గంగవ్వ.. ఓటింగ్‌లో దూసుకుపోతుంది. ఆమె తరువాతి స్థానంలో దివి ఉన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :