Thursday, September 24, 2020

Containment zones



Read also:

కంటెయిన్‌మెంట్‌ జోన్‌ ఉపాధ్యాయులకు మినహాయింపు



Containment_zone

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉండే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలల హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధ్యాయుల మార్గదర్శకం కోసం 9, 10, ఇంటర్‌ విద్యార్థులు పాఠశాలలకు రావాలన్నది నిర్భందమేమీ కాదని, విద్యార్థుల ఐచ్ఛికమేనని వెల్లడించింది.

బయోమెట్రిక్ హాజరువద్దు

రిస్కు ఉన్న టీచర్లకు ఫ్రంట్ లైన్ వర్కు వద్దు

విద్యార్థుల హాజరూ తీసుకోవాలి

విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు


ఆంధ్రప్రదేశ్ లో  పాఠశాలలు పాక్షికంగా తెరిచిన క్రమంలో ఆరోగ్య పరంగా సమస్యలు  ఉన్న టీచర్లు ఇతర సిబ్బంది ఫ్రంట్ లైన్ పని కి దూ రంగా  ఉండాలని పాఠశాల విద్యాశాఖ  మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్రం అన్ లాక్ 4.0  మార్గదర్శకాలు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వమూ సెప్టెంబరు 21 నుంచి పాక్షికంగా స్కూళ్లు తెరిచింది. 9 వ తరగతి , ఆ పై విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు పాఠశాలలకు రావచ్చు పాఠశాలల్లో కార్యకలాపాల నిర్వహణ,పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ కమిషనర్  బుధవారం మార్గదర్శకాలు ఇచ్చారు.  ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులు,టీచర్లు,గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఫ్రంట్ లైన్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులతో నేరుగా కాంటాక్టు లేకుండా చూసుకోవాలి.

టీచర్లకు బయోమెట్రిక్  హాజరు వద్దు. ప్రత్యామ్నాయ మార్గం చూడాలి.  కాంటాక్టు లెస్ అటెండెన్సు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

బోధన, బోధనేతర సిబ్బంది 50శాతం మంది హాజరు కావాలి.

పాఠశాలల్లో   ఆరు అడుగుల దూరం  ఉండేలా చూసుకోవాలి. అందరూ మాస్కులు వినియోగించాలి.

పిల్లలు తరచు 40 నుంచి 6 0 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి.

ఆల్కహాల్ శానిటైజర్లు వినియోగించేలా  చూడాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :