Sunday, January 5, 2020

vykunta yekadasi



Read also:


పూర్తిస్థాయి ఉపవాసం సాధ్యం కాదనుకునేవారు పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో మనసంతా దేవుడిపైనే లగ్నం చెయ్యడం వల్ల అంతర్గతంగా జ్ఞానోదయం కలుగుతుంది.
ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున 33 కోట్ల దేవతల్ని వెంటబెట్టుకొని శ్రీమహావుష్ణుమూర్తి భూమికి వస్తారని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పుణ్యదినాన భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. ఇష్టదైవంపైనే మనసు లగ్నం చేసి దీక్ష పాటిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు. ఈ అవకాశం కల్పిస్తూ తిరుమలలో ఈనెల 6న (సోమవారం) ఉదయం ధనుర్మాస కైంకర్యాల తర్వాత తెల్లవారు జామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.
ఉపవాస దీక్ష:ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేసే భక్తులు ముందు రోజే ఉపవాసం ప్రారంభిస్తారు. తులసి తీర్థం మాత్రమే తాగుతూ, రాత్రి జాగారం చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని తీసుకుని ఉపవాస దీక్షను ముగిస్తారు. పూర్తిస్థాయి ఉపవాసం సాధ్యం కాదనుకునేవారు పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో మనసంతా దేవుడిపైనే లగ్నం చెయ్యడం వల్ల అంతర్గతంగా జ్ఞానోదయం కలుగుతుంది. భగవన్నామస్మరణ వల్ల మానసిక ఉల్లాసం, సంతృప్తి కలుగుతాయి.
సైంటిఫిక్‌గా మన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని వ్యర్థాలు పొట్టలో ఉండిపోతాయి. ఉపవాస దీక్ష సమయంలో పొట్టలో ఆహారం ఉండకపోవడంతో మిగిలిపోయిన వ్యర్థాల్ని పేగులు స్వీకరిస్తాయి. తద్వారా జీర్ణవ్యవస్థ పరిశుద్ధం అవుతుంది. దీక్ష సమయంలో నీటిని మాత్రమే తాగడం వల్ల పొట్టలో మిగిలిపోయే వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. తద్వారా జీర్ణక్రియావ్యవస్థ మెరుగవుతుంది. అందుకే ఇలాంటి పవిత్రమైన దినాన ఉపవాస దీక్ష చెయ్యడం అన్ని విధాలా సత్ఫలితాలిస్తుందని పండితులు చెబుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :