Friday, January 10, 2020

Update your mobile number in sbi account



Read also:


ప్రతీ నెల అకౌంట్ స్టేట్‌మెంట్‌ను మెయిల్ ఐడీకి పంపిస్తుంది బ్యాంకు. మీరు మెయిల్ ఐడీ మార్చినట్టైతే స్టేట్‌మెంట్ మీకు రాదు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. మొబైల్ నెంబర్ మారిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. మొబైల్ నెంబర్ మాత్రమే కాదు ఇమెయిల్ ఐడీ మార్చినా బ్యాంకులో అప్‌డేట్ చేయాలంటోంది. ట్విట్టర్ ద్వారా కస్టమర్లను అలర్ట్ చేసింది ఎస్‌బీఐ. అంతేకాదు.ఒకవేళ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయించకపోతే కలిగే నష్టాలను కూడా వివరిస్తోంది. కస్టమర్ల అకౌంట్లకు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ రిజిస్టరై ఉంటుంది. కస్టమర్లు ఏ లావాదేవీలు జరిపినా మొబైల్ నెంబర్‌కు, ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ మార్చినట్టైతే వెంటనే బ్యాంకులో అప్‌డేట్ చేయించాలి. లేకపోతే ఓటీపీ, పిన్ యాక్టివేషన్ మెసేజెస్ లాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోలేరు. అంతేకాదు.ప్రతీ నెల అకౌంట్ స్టేట్‌మెంట్‌ను మెయిల్ ఐడీకి పంపిస్తుంది బ్యాంకు. మీరు మెయిల్ ఐడీ మార్చినట్టైతే స్టేట్‌మెంట్ కూడా మీకు రాదు. దాంతో పాటు బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్స్, ఆఫర్స్ గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా తెలియజేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఈ వివరాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉండదు. అందుకే మీరు మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ మారిస్తే వెంటనే అప్‌డేట్ చేయాలి. మీరు మీ మొబైల్ నెంబర్ మార్చడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ మొబైల్ నెంబర్‌ని ఈజీగా మార్చొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

SBI Mobile Number Update: ఎస్‌బీఐలో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయండి ఇలా

  • ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • మీ ఎస్‌బీఐ అకౌంట్‌లో లాగిన్ అవండి. 'My Accounts & Profile' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • డ్రాప్ డౌన్ మెనూలో 'Profile' క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో 'Personal Details/Mobile' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత వచ్చే పేజీలో of 'Personal Details' కనిపిస్తుంది. మీ 'Profile Password' ఎంటర్ చేసి 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో మీ పేరు, ఇమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత 'Change Mobile Number-Domestic only (Through OTP/ATM/Contact Centre)' పైన క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో 'Personal Details-Mobile Number Update' కనిపిస్తుంది. మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ అనే మెసేజ్ మీ మొబైల్ నెంబర్‌తో కనిపిస్తుంది. మొబైల్ నెంబర్‌ సరిచూసుకొని OK క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత OTP, IRATA, Contact Centre అని మరో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • By OTP on both the Mobile Numbers ఆప్షన్ ఎంచుకొని 'Proceed' బటన్ క్లిక్ చేయండి.
  • తర్వాత పేజీలో మీ డెబిట్ కార్డ్ ఉన్న అకౌంట్ ఎంచుకోండి.
  • తర్వాత పేజీలో మీరు ఏ అకౌంట్‌కు మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారో వివరాలుంటాయి. సరిచూసుకోండి.
  • తర్వాత పేజీలో మీ ఏటీఎం కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి.
  • తర్వాత పేజీలో Click Here పైన క్లిక్ చేయండి.
  • మీ ఫోన్‌కు రిఫరెన్స్ నెంబర్‌తో పాటు ఓటీపీ వస్తుంది.
  • ఆ తర్వాత మీ కొత్త నెంబర్ యాక్టివేషన్ కోరుతూ 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు.
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • 'Profile' సెక్షన్‌లోనే ఇమెయిల్ ఐడీ కూడా అప్‌డేట్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :