Tuesday, January 7, 2020

Do these things if your phone run slow



Read also:


స్మార్ట్ ఫోన్ కొత్తలో మంచి జోరుమీద ఉంటుంది. అప్లికేషన్లు వేగంగా కదులుతాయి. కానీ, కొన్ని నెలల వాడకం తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. నిదానంగా ఓపెన్ అవుతూ వేగంగా స్పందించే తత్వం తగ్గిపోతుంది. దీంతో విన‌యోగ‌దారుల‌కు చిరెత్తుకొస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంటుంది. సాధార‌ణంగా చాలామంది కొత్తగా ఫోన్లు కొనబోయేటప్పుడు స్పెసిఫికేషన్లు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. స్పెసిఫికేషన్‌ బాగుంటే ఫోన్‌ వేగంగా పనిచేస్తుంది అన్నది వారి భావన. కానీ.. అస‌లు విష‌యం ఆ త‌ర్వాత తెలుస్తుంది. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌ప్పించుకోవాల్సి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
అందుకు ముందు మీ హోం స్క్రీన్ మీద కూడా ఎక్కువ యాప్ ఐకాన్స్ లేకుండా చూసుకోవాలి. హోం స్క్రీన్ మీద ఎక్కువ యాప్ ఐకాన్స్ ఉంటే స్క్రీన్ గజిబిజిగా కనిపించడమే కాకుండా పనితీరు కూడా స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ టాస్క్ కిల్లర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే అధికంగా ర్యామ్ ను వినియోగించుకునే, ఫోన్ ను స్లో చేస్తున్న ఏ యాప్ ను అయినా సులభంగా కిల్ చేయవచ్చు. అలాగే  కేవలం అవసరమైన అప్లికేషన్లు మాత్రమే డౌన్లోడ్‌ చేసుకోవటం, ఫొటోలు, వీడియోల వంటివాటిలో ఏవైనా డూప్లికేట్‌ ఫైళ్లు ఉంటే గుర్తించి వాటిని తొలగించాలి.
అలాగే తరచూ వాట్స్‌పకి వచ్చే ఫార్వార్డెడ్‌ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు తొలగించడం, ఎప్పటికప్పుడు ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ తగినంత మొత్తంలో ఉండేలా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇక‌ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ సాఫ్ట్ వేర్ అప్ డేటెడ్ గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పాత వెర్షన్ లో ఉండే లోపాలు, బగ్స్ వంటి వాటిని నివారించి కొత్త అప్ డేట్లో లోపాలు లేకుండా ఇవ్వడానికి కంపెనీలు ప్రయత్నిస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :