Tuesday, January 7, 2020

Black slat is good for health



Read also:


బ్లాక్ సాల్ట్ అనేది.ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటూ... టేస్ట్ కూడా ఇస్తుంది. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.
మన ఇళ్లలో రెగ్యులర్ సాల్ట్‌కి తోడు.తినే సోడా ఉప్పును వంటల్లో వాడుతుంటారు. కొన్ని సార్లు నిమ్మ ఉప్పును కూడా వాడుతారు. ఈ బ్లాక్ సాల్ట్ అనేది అందరూ వాడరు. ఎందుకంటే... ఇది రెగ్యులర్ ఉప్పులా అన్ని షాపుల్లోనూ దొరకదు. కానీ... దీనికి ఉన్న రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా.పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది దీన్ని వాడేందుకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇందులో చాలా రకాలున్నాయి. వీటిలో హిమాలయన్ బ్లాక్ సాల్ట్ ఎక్కువగా వాడుకలో ఉంది. హిమాలయాల్లో ఉప్పు గనుల నుంచీ ఈ సాల్ట్‌ను వెలికి తీస్తున్నారు. పూర్వం ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడేవారు. ఇప్పుడు దీన్ని ఆయుర్వేదంతోపాటూ.ఇళ్లలో కూడా వాడుతున్నారు. పేరుకి ఇది బ్లాక్ సాల్ట్ అయినా నల్లగా కాకుండాగులాబీ, గోధుమ రంగుల్లో ఉంటుంది.
పూర్వం బ్లాక్ సాల్ట్‌లో మూలికలు, గింజలు, సుగంధ ద్రవ్యాల్ని కలిపి.వేడి చేసేవారు. అది అత్యుత్తమమైనది. ఈ రోజుల్లో బ్లాక్ సాల్ట్‌ని కృత్రిమంగా కూడా తయారుచేసేస్తున్నారు. సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం బైసల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్ కలిపి.ఈ మిశ్రమాన్ని చార్‌కోల్‌లో మిక్స్ చేసి... వేడి చేస్తే... బ్లాక్ సాల్ట్ తయారైపోతోంది. మనం రెగ్యులర్‌గా వాడే సాల్ట్.బాగా ప్రాసెస్ చేసి, చాలా మినరల్స్‌ని తొలగించి ప్యాక్ చేస్తున్నారు. అందువల్ల అది అంతగా కలిసొచ్చేదేమీ ఉండట్లేదు. ఆయుర్వేద బ్లాక్ సాల్ట్ ప్యాకెట్ కొనుక్కోవడం ఉత్తమం.

సాధారణ సాల్ట్ కంటే... బ్లాక్ సాల్ట్ వాడటం బెటర్ అంటున్నారు డాక్టర్లు, ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే.బ్లాక్ సాల్ట్‌లో తక్కువ సోడియం ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి.బ్లాక్ సాల్ట్ మేలు చేస్తుంది. ఐతే.బ్లాక్ సాల్ట్ ప్యాకెట్ కొనేటప్పుడు అందులో సోడియం ఎంత ఉందో చూసుకోవాలి. కొన్ని రకాల బ్లాక్ సాల్ట్‌లలో సోడియం ఎక్కువగానే ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :