Sunday, December 29, 2019

What EVm card Why RBI introduced this



Read also:

ఈ రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు అనేవి క్రమంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు. ఏదోక రూపంలో క్రెడిట్, డెబిట్ కార్డుల్లో నగదు పోతూనే ఉంది. దీనితో చాలా మంది వాటిని వాడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందనేది వాస్తవ౦. బ్యాంకులు ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటించినా సరే అది మాత్రం ఆగడం లేదు. ఆర్బిఐ ఎన్ని నిభందనలు తీసుకొచ్చినా సరే మోసం చేయడం ఆగట్లేదు.

ఈ నేపధ్యంలో మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులను భారత రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 31 తర్వాత అవి పని చేయవు. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులను యూరోపే, మాస్టర్‌ కార్డ్‌, వీసా (ఈఎంవీ) చిప్‌ కార్డుగా మార్చుకోవడం అనేది తప్పనిసరి చేసింది.

ఈఎంవీ కాని కార్డులు అన్ని కూడా 31 తర్వాత పని చేయవు అన్నమాట. పైన పేర్కొన్న బ్యాంకులకు చెందిన వినియోగదారులు ఎక్కువగా మాగ్నెటిక్ కార్డులు వాడుతున్నారు.

ఇప్పటికే ఆ బ్యాంకు లు వినియోగదారులకు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసలు ఈఎంవీ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా (ఈఎంవీ)లకు సంబంధించిన సాంకేతికతను డెబిట్‌ కార్డు చెల్లింపుల్లో ప్రామాణికంగా పరిగణిస్తూ ఉంటారు. ముందు తీసుకొచ్చిన మాగ్నెటిక్ కార్డులతో పోలిస్తే ఇది చాలా సేఫ్. అందుకే భారత్ లో ఈఎంవి కార్డులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తప్పనిసరిగా చేసింది. దీనితో మోసం చేయడం దాదాపుగా అసాధ్యం అని నిపుణులు కూడా చెప్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :