Sunday, December 8, 2019

Telecom recharge rates revert backed



Read also:

పరిమితుల్ని ఎత్తివేసిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

పరిమితుల్ని ఎత్తివేసిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా
84 రోజుల ప్లాన్‌లో 3 వేల నిమిషాలు, 365 రోజుల ప్లాన్‌లో 12 వేల నిమిషాలను ఇస్తున్నాయి. ఈ పరిమితి దాటితో టాప్‌అప్‌లు వేసుకోవాల్సిందే. నిమిషానికి 6 పైసల చార్జీ వర్తిస్తుందని ఈ నెల 3న ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా ఇక నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని రెండు సంస్థలు ట్వీట్ చేశాయి.

ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లకు కాల్స్, డేటా చార్జీలను 50 శాతం వరకు పెంచుతున్నట్లు ఈ నెల 1న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా రూ.219, రూ.399, రూ.449 ప్లాన్లను ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఎయిర్‌టెల్ వివరాల ప్రకారం రూ.219 ప్లాన్ 28 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కైనా), రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి.

రూ.399 ప్లాన్ గడువు 56 రోజులు. అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 1.5జీడీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.449 ప్లాన్ కాలపరిమితి కూడా 56 రోజులే. అయితే ఇందులో అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకుతోడు రోజు కు 2జీబీ డేటా వస్తుంది.

ఎయిర్‌టెల్ తరహాలో వొడాఐడియా రూ.219 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా, ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేతతో ఎయిర్‌టెల్ రూ.399 కొత్త ప్లాన్.. జియో రూ.399 ప్లాన్ కంటే చౌక కావడం గమనార్హం. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీం కోర్టు తీర్పుతో టెలికం పరిశ్రమపై భారం పడిన విషయం తెలిసిందే.

దీన్ని అధిగమించేందుకే ఆయా సంస్థలు చార్జీలను పెంచిన సంగతీ విదితమే. వొడాఫోన్ ఐడియాకే దెబ్బ.. ఏజీఆర్‌పై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఎయిర్‌టెల్ కంటే వొడా ఐడియాకే దెబ్బని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడిచిన 14 ఏండ్లకుగాను స్పెక్ట్రం వినియోగ చార్జీ, లైసెన్స్ ఫీజులు, వాటికి వడ్డీ, జరిమానాలు చెల్లించాలన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించినది తెలిసిందే. దీంతో 1.47 లక్షల కోట్ల భారం టెలికం పరిశ్రమపై పడింది. 3 నెలల్లోగా చెల్లించాలనీ దేశించింది. ఎయిర్‌టెల్ 4.8 బిలియన్ డాలర్లు, వొడా ఐడియా 5 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి వస్తున్నది. ఫలితంగా ఈ సంస్థలు సుప్రీంలో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు వేశాయి. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటంతో రివ్యూ పిటిషన్ కొట్టివేత ఆ సంస్థకు ఇబ్బందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :