Tuesday, December 17, 2019

pulse polio on january19



Read also:

జనవరి 19న పల్స్‌పోలియో

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 16 : జనవరి 19న నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అంకితభావంతో నిర్వహిం చాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం వైద్యశాఖ అధికారులతో ఈ మేరకు ఆయన సమీక్షించారు. 0-5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడమే లక్ష్యమన్నారు. చుక్కలమందు అందిం చేందుకు 12,768 బూత్‌ టీమ్‌ సభ్యులు, 99 మొబైల్‌ టీంలకు, 198 మంది సభ్యులను విధులకు నియమించినట్టు తెలిపారు. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కల మందు వేస్తారన్నారు.
జనవరి 20,21 తేదీల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేస్తారన్నారు. చుక్కల మందుల కేంద్రాలైన పాఠశాలలను జనవరి 19న తెరిచేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ-2 తేజ్‌భరత్‌, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారిణి సుబ్రహ్మణేశ్వరి, డీపీవో, డీఈవో పాల్గొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :