Saturday, December 28, 2019

Mana Badi Nadu nedu full details



Read also:

ఈ నెల 31న మాస్టర్‌ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్‌పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్‌ కలెక్టర్‌కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్‌ వాటికి అనుమతి ఇస్తారు.జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్‌ఎం, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్‌ కమిటీ తీర్మానం చేయాలి. 10న సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలతో పేరెంట్‌ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.
నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో సమర్థవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పథకం కింద ప్రభుత్వం కొన్ని పాఠశాల నుండి ఇప్పటికే STMS యాప్ ద్వారా మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఎంపిక చేశారు ఈ పాఠశాల అభివృద్ధికి మార్చి 15వ తేదీ లోపు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేస్తారు విధివిధానాలు ఏంటి అనేది ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఆధారంగా మీ అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము.

కార్యక్రమం ఎలా అమలు చేస్తారు?

  • ముందుగా ఈ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి  
  • ఈ కమిటీ కి మాత్రమే పాఠశాల అభివృద్ధి పనులు అప్పగించాలి కాంట్రాక్టర్లకు వేరే వారికి ఎట్టి పరిస్థితులలోను అప్పగించురాదు 
  • పేరెంట్స్ కమిటీ నుండి ఐదుగురు సభ్యలు ఎంపిక చేసుకోవాలి ఎన్నిక  ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉండే విధంగా చూడాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ నుండి సైట్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా సభ్యులుగా ఉంటారు  
  • ఎంపిక చేసిన పాఠశాలను సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్ వచ్చి ఈ కమిటీ తో సమావేశం  అయ్యి పాఠశాలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఎస్టిమేషన్ రూపొందిస్తారు 
  • ఎస్టిమేషన్ రూపొందించిన తర్వాత ఆన్లైన్లో ఎస్టిమేషన్ అప్లోడ్ చేస్తారు ఒకసారి అప్లోడ్ చేసిన ఎస్టిమేషన్ మార్చడానికి సాధ్యం కాదు అందుకని ప్రధానోపాధ్యాయులు తమకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ముందుగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది
  • ఈ కమిటీ నీ పనులు చేయడానికి వారు ఖర్చు చేసే పనికి  ముందుగానే కొటేషన్ తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ ఛానల్ పిడి ఎకౌంట్స్ ద్వారా సంబంధిత షాపులకు ఈ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయబడుతుంది 
  • అమౌంట్ పడిన తర్వాత వారి దగ్గర నుండి జిఎస్టి బిల్లు తీసుకోవాలి ఈ బిల్లులు పూర్తి చేయడానికి ఎంపిక చేసిన పాఠశాలలో నెలకు రెండు వేలు ఇచ్చి ఒక వ్యక్తి నియమిస్తారు ఆయనే ఈ బిల్లులు వ్యవహారాలను చూసుకుంటారు.
  • ఈ పాఠశాల అభివృద్ధి అంతా మార్చి 15వ తేదీ లోపు పూర్తి అవ్వాలి.
  • జిల్లాలో 13 మంది సభ్యులతో ఒకటి ఉంటుంది ఈ కమిటీ పనులు పర్యవేక్షిస్తుంది.
నాడు నేడు కు ఎంపికైన స్కూల్స్ నిధుల జమ చెల్లింపు ల కోసం కొత్తగా అకౌంట్ తీసుకోవాలి.దీనికి గాను అవసరమయ్యే కవరింగ్ లెటర్ ను మీ స్కూల్ డైస్ కోడ్ తో ఈ క్రింది లింక్ నుండి పొందండి. ఎం.ఈ.ఓ కౌంటర్ సైన్ తో, కౌంటర్ సైన్ లేకుండా రెండు రకాలుగా లెటర్ ను ప్రింట్ తీసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :