Sunday, December 15, 2019

Good news for degree students



Read also:

డిగ్రీ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ గవర్నమెంట్

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజలకు, విద్యార్థులకు పలు అరుదైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే.. డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వచ్చే స్టడీ ఇయర్ నుంచి డిగ్రీని నాలుగు సంవత్సరాలు చేశారు జగన్. దీంతో స్టూడెంట్స్ కాస్త నిరాశ చెందారు. అయితే.. ఇప్పుడు దాని నుంచి వారి మనసు మళ్లించడానికి.. డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు 6 కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సిఈవో శ్రీకాంత్ తెలిపారు. ఈ శిక్షణను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దాదాపు 64 కాలేజీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.ఇప్పుడు దాదాపు అంతా ఐటీకి సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. ఈ కామర్స్, వెబ్ డిజైనింగ్, డెబిట్ రికవరీ ఏజెంట్, ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంటేషన్, ఫార్మా మార్కెటింగ్, ఎన్‌ఎస్ఈ క్యాపిటల్ మార్కెట్, ఆక్వాఫీడ్ మార్కెటింగ్‌పై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :