Sunday, December 15, 2019

Don't go to any temple after visit the srikalahasti temple



Read also:

శ్రీకాళహస్తి గుడి దర్శనం అయ్యాక ఏ గుడికి వెళ్ళకూడదు ఎందుకంటే 

తిరుమల తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు దాదాపుగా శ్రీకాళహస్తి వెళ్లి పరం శివుణ్ణి దర్శించుకుంటారుఅలాగే అక్కడ రాహు కేతువులకు పూజ చేయించుకొని ఇంటికి వస్తూ ఉంటారు. కొంత మంది శ్రీకాళహస్తి దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళుతూ ఉంటారు.ఆల వెళ్ళటం తప్పని అంటున్నారు పండితులు.అసలు శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ విశాల విశ్వము గాలి,నింగి,నేల,నీరు,నిప్పు అనే పంచభూతాల నిలయంగా ఉందిఆ పంచ భూతాలు భూమి మీద పంచ భూత లింగాలుగా వెలిసాయి.వాటిలో వాయు లింగం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసింది.ఈ ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఒక నియమాం ఉంది.అయితే ఆ నియమం వెనక ఒక పరమార్ధం కూడా ఉంది.
శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో ఏవైనా సర్ప దోషాలు ఉంటే తొలగిపోతాయి.ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నాక నేరుగా ఇంటికి వెళ్ళాలి.ఎందుకంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళితేనే దోష నివారణ జరుగుతుంది.తిరిగి ఏ దేవాలయానికి వెళ్లిన దోష నివారణ జరగదని అంటూ ఉంటారు.
గ్రహణాలు.శని బాధలు.పరమశివుడుకి ఉండవనిమిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం.గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.
గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచే ఉంటుంది.అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :