Friday, December 20, 2019

Do excercises for get healthy



Read also:

మెదడుకు ఆక్సిజన్‌ చక్కగా అందాలంటే వ్యాయామం చేయండి. పరిశోధకుల సూచన

గుర్తించిన అమెరికాలోని పెన్‌ న్యూరోసైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు
ఎలుకలపై పరిశోధన
వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ రేటు పెరుగుదల
వ్యాయామం మనిషిని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తుంది. ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వ్యాయామం వల్ల మెదకుడు కలిగే ప్రయోజనాలపై పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్‌ చక్కగా అందితే చురుకుదనం పెరుగుతుంది. ఇందుకోసం వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికాలోని పెన్‌ న్యూరోసైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం తెలిసిందని వివరించారు.
వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ, నాడీకణాల చర్యల రేటు పెరుగుతుందని, దీంతో రక్తం ద్వారా ఎలుకల మెదడుకు అందే ఆక్సిజన్‌ మోతాదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్‌ లభ్యత పెరగాలంటే వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :