Monday, December 16, 2019

AmmaVodi latest information



Read also:

అమ్మఒడి జాబితాలపై సామాజిక తనిఖీ-అభ్యంతరాలకు నేడే ఆఖరు

24వ తేదీకి తుది జాబితా-జనవరి 9న లబ్ధిదారుల ఖాతాలో జమ
జగనన్న అమ్మఒడి పథకం లబ్దిదారుల జాబితాలపై ప్రభుత్వం సామాజిక తనిఖీలు చేపట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నెల 24వ తేదీకి తుది జాబితాపై ఆమోద ముద్ర పడనున్నది. జనవరి 9న లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు జమ చేయనున్నది.

అమ్మఒడి జాబితాపై అభ్యంతరాలను సోమవారంలోగా స్వీకరిస్తారు.

విద్యార్థుల తల్లిదండ్రుల చిరునామాలకు వెళ్లి వివరాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలి. అర్హత గలవారి పిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని ముసాయిదా జాబితాను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి. ఈ జాబితా గ్రామ సభ ఆమోదం పొందాలి. గ్రామ సభ ఆమోదం పొందిన జాబితాను ఈ నెల 22వ తేదీలోగా మండల విద్యాధికారులు డీఈవోల ఆమోదానికి పంపాలి. మండల విద్యాశాఖ అధికారులు పంపిన జాబితాను పరిశీలించి జిల్లా విద్యాశాఖ అధికారి ఆమోదముద్ర వేయాలి. జిల్లాలోని అన్ని మండలాల జాబితాను ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లా కలెక్టర్‌ ఆమోదముద్ర పడిన తుది జాబితాలోని వారికి అమ్మఒడి ఆర్థిక సహాయం నిధులు మంజూరవుతాయి.

విద్యార్థుల అడ్రస్సులు తేలడం లేదు

విద్యార్థుల వివరాలలో కొందరివి తల్లిదండ్రుల చిరునామాలు దొరకక క్షేత్రస్థాయి అధికారులు విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు చిరునామాల ఆచూకీ తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో ఉన్న చిరునామాల ప్రకారం ఒక చోట, నివసిస్తుండటం మరో చోట కావడంతో లెక్కలు తేలడం లేదు. ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు వివరిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :