Thursday, December 5, 2019

IT supervision over village ministries



Read also:

గ్రామ సచివాలయాలపై ఐటీ పర్యవేక్షణ


గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందించడం, అదేవిధంగా ఆ సేవలు అందుతున్నాయా? లేదా? అన్నది పర్యవేక్షించేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వలంటీర్లు తమకు కేటాయించిన వార్డులోని కుటుంబాల వివరాలు తీసుకుంటున్నారు. అయితే వాటిని ఆన్‌లైన్‌లో ఆర్టీజీ కేంద్రానికి అప్‌లోడ్‌ చేయడానికి వారికి తగిన సౌకర్యాలు లేవు. పురపాలక వార్డుల్లో కార్యాలయాలు, వాటిలో కంప్యూటర్లు లేవు. దీంతో కమ్యూనిటీ హాళ్ల నుంచి ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఫీడ్‌ అధికారులు చెప్తున్నారు. అయితే కమ్యూనిటీ హాళ్లలో ఇతర కార్యక్రమాలేమైనా ఉంటే అవి పూర్తయ్యే వరకూ వలంటీర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
కొన్నిచోట్ల ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని కంప్యూటర్లను ఉపయోగించుకునేలా ఏర్పాటుచేశారు. ఆ కళాశాలల తరగతులు ముగిశాకే సమాచారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇక్కడా కొన్ని ఇబ్బందులను సచివాలయ సిబ్బంది ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల స్థాయిలో ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు ఐటీ శాఖ ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఇటీవల సీఎం జగన్‌ ఆదేశించారు. ఆ మేరకు ఆర్టీజీ, ఐటీ శాఖలు ప్రణాళిక రూపొందించాయి. ఈ విషయంలో ఆర్టీజీకి సహకరించేందుకు ఎస్టోనియా దేశంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ఒప్పందం చేసుకోనుంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :