Saturday, November 16, 2019

MDM guidelines for providing good food



Read also:

సిబ్బంది వంట పని ప్రారంభం మొదలు వడ్డించే వరకు పాటించాల్సిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.ఈమేరకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ నవంబర్ 14న జారీ చేసింది.
పది అంశాలతో కూడిన నిబంధనలు పాటిస్తే పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందించవచ్చని స్పష్టం చేసింది. విద్యాశాఖ విధించిన నిబంధనలను వంట సిబ్బంది విధిగా పాటించేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

ఇవీ నిబంధనలు

  • పథకానికి వినియోగించే బియ్యం బస్తాలను వంటగదిలో లేదా భద్రపర్చే గదిలో పరిశుభ్రమైన పరిస్థితులుండేలా చూడాలి.
  • ఆ పరిసరాల్లో కూడా అలాంటి వాతావరణమే ఉండాలి.
  • పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే భోజనం వడ్డించే చోట దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్ర పర్చుకునేందుకు సబ్బు నీళ్లు, సబ్బులు, హ్యాండ్ వాష్ ద్రవాలను అందుబాటులో ఉంచాలి.
  • బియ్యం, పప్పు తదితర నిల్వలను ఎలాంటి క్రిమి కీటకాలు చొరబడకుండా భద్రపర్చాలి.
  • ఇరుకుగదుల్లో, బాగా చీకటి గదులు, ఎక్కువ రోజులు వినియోగించని గదుల్లో బియ్యం, పప్పు తదితరాలను నిల్వ చేయరాదు.
  • ప్రామాణిక కార్యాచరణ తప్పకుండా పాటించాలి.
  • వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు ఆ సిబ్బంది తప్పకుండా తలకు క్యాప్‌లు, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్‌స (తెల్ల కోటు) విధిగా ధరించాలి.
  • వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పాఠశాల హెచ్‌ఎంలు వారికి అవగాహన కల్పించి చైతన్యపర్చాలి.
  • మధ్యాహ్న భోజనం, తాగునీరు కల్తీ జరగకుండా తరచుగా మైక్రోస్కోప్ ద్వారా పరీక్షలు చేయించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :