Friday, November 22, 2019

Constitutional Days from 26th



Read also:

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26 నుంచి 2020 ఏప్రిల్‌ 14 వరకు (డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వరకు) పలు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.సదరు కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించింది. దేశంలోని అన్ని పాఠశాలల్లో పలు.కార్యక్రమాలను నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు వెలువరించింది.
Constitutional Days from 26th

ఆయా కార్యక్రమాల వివరాలు

  • రాజ్యాంగ ప్రతిజ్ఞ చదవడానికి అన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించాలి.
  • పాఠశాల, జిల్లా స్థాయిలో చర్చలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలి.
  • రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక విధులు, ఇతర ఇతివృత్తాలపై వ్యాసరచన, క్విజ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి.
  • రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక విధులను పాఠశాలల అసెంబ్లీలలో చదివించాలి.

నమూనా పార్లమెంట్‌ను నిర్వహించాలి

  • ప్రాథమిక విధులపై ప్రజల సందేశాలు, ప్రాథమిక విధులపై ప్రచార, కరపత్రాలు, ఇ-పోస్టర్లను హిందీ, ఆంగ్ల భాషల్లో తయారుచేసి పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయాలి.
  • ప్రాథమిక విధులపై సందేశాన్ని వ్యాప్తి చేయడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించి సందేశాలు ఇప్పించాలి.
  • ప్రాథమిక విధులు, సంబంధిత ఇతివృత్తాలపై న్యాయవాదులతో పాఠశాలల్లో చర్చలు నిర్వహించాలి.

కార్యక్రమాల ప్రణాళిక

  • 26.11.19: రాజ్యాంగ ప్రతిజ్ఞ చదవడానికి అన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించాలి. వక్తృత్వ, వ్యాసరచన, స్కిట్‌, క్విజ్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, ఉపన్యాసాలు నిర్వహించాలి.
  • డిసెంబరులో.ఉదయం పాఠశాలల్లో నిర్వహించే అసెంబ్లీలో ప్రాథమిక విధులను పఠించాలి.ప్రాథమిక విధులపై బ్రోచర్లు, కరపత్రాలు, ఇ-పోస్టర్లను ప్రాంతీయ భాషల్లో తయారుచేసి విద్యార్థులకు పంపిణీ చేయాలి.
  • 2020 జనవరిలో.పాఠశాలల్లో నిర్దేశించిన అంశాలపై చర్చలు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్లు, క్విజ్‌ పోటీలు, సదస్సులు, ఉపన్యాస కార్యక్రామలు నిర్వహించాలి. విద్యార్థులు సిబ్బందిలో ప్రాథమిక విధులపై భవానా వ్యాప్తి చెందడానికి నమూనా పార్లమెంట్‌ను, ప్రజా సందేశాల కార్యక్రమాలను నిర్వహించాలి.
  • 2020 ఫిబ్రవరిలో.ప్రాథమిక విధులు, సంబంధిత ఇతివృత్తాలపై న్యాయవాదులతో, న్యాయ విజ్ఞానులతో పాఠశాలల్లో చర్చలు నిర్వహించాలి.
  • 2020 ఏప్రిల్‌ 14న.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుక నిర్వహించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :