Sunday, November 3, 2019

beware of it returns fake messages



Read also:

ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టండి అంటూ మీ మొబైల్‌కు ఏమైనా మెసేజ్‌ వచ్చిందా.? జాగ్రత్త! అది నకిలీ మెసేజ్‌. అలాంటివి వచ్చినప్పుడు వెంటనే సైబర్‌ అధికారులకు ఫిర్యాదు చేయండని హెచ్చరిస్తోంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొంది.

beware of it returns fake messages 

ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం రిక్వెస్ట్‌ పంపాలని ఐటీ శాఖ నుంచి ఏదైనా మెసేజ్‌ వచ్చిందా? ఆ మెసేజ్‌లు నకిలీవి. సైబర్‌ మోసగాళ్ల సరికొత్త పంథా ఇది. అలాంటివి వచ్చినప్పుడు అందులో ఇచ్చిన లింక్‌లను క్లిక్ చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయండి’ అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. ప్రజల అవగాహన కోసం ఓ వీడియోను కూడా పోస్టు చేసింది.ఆ నకిలీ మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసిన వెంటనే సైబర్‌ మోసగాళ్లు ఐడీ, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారు. వాటి సాయంతో అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది. అలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దని, వ్యక్తిగత ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది.ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగానీ, ఐటీ శాఖ కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రత్యేక అభ్యర్థలను కోరదు. అందుకే అలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :