Tuesday, October 29, 2019

English medium from next year



Read also:

విద్యారంగ సంస్కరణలపై బాలకృష్ణన్‌ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేసింది. కమిటీ సిఫార్సులపై సీఎం సచివాలయంలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతులకు ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు. మరోవైపు పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్‌ చెప్పారు. కమిటీ నిపుణులు తాము చేసిన సిఫార్సుల అమలు బాధ్యతనూ తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మ ఒడి, నాడు-నేడు కార్యక్రమాలను నిపుణుల కమిటీ ప్రశంసించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :