Sunday, September 22, 2019

భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలంపై భారిగా బంగారం.వెలిక్కి తీసేందుకు ప్రయత్నాలు



Read also:

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది మన భారతదేశంలో ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ బంగారం వాడకం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ప్రపంచం మొత్తం వాడుతున్న బంగారం మొత్తాల్లో మన దేశంలోనే 11 శాతం మించి బంగారాన్ని వాడుతున్నారు అంటే భారతదేశంలో బంగారం ఎంత ఎక్కువ గా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరిగిన ఆధునిక టెక్నాలజీతో బంగారం భూమిలో ఎక్కడ ఉన్న గుర్తించి వెలికితీసి దాన్ని శుద్ధి చేసి వాడుకలోకి తెస్తున్నారు. అయితే బంగారాన్ని వెలికి తీయడం అంత సులువైన పని కాదు 28 గ్రాముల బంగారాన్ని బయటకు తీయాలంటే 2, 50, 000 కేజీల రాళ్లను బయటకు తవ్వి తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతి ప్రమాదకరమైన సైనేడ్ ద్రావణాన్ని ఉపయోగించి బంగారం శుద్ధి చేయాలి దీనివల్ల పర్యావరణానికి ఎంతో కీడు జరుగుతుంది.

అయితే భూమి పైనే కాదు భూమికి దగ్గరలో ఉన్న ఓ గ్రహశకలం పై కూడా అధిక మొత్తంలో బంగారం ఉందని నాసా పరిశోధనలో తేలింది. భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలం పై వివిధ ఖనిజాలతో పాటు అధిక మొత్తంలో బంగారం ఉందని 1998లో నాసా పరిశోధనలో తేలిందట . కానీ ఆ గ్రహ శకలం పై నుంచి భూమ్మీదికి ఆ బంగారాన్ని తవ్వి తీసుకు రావటం అసాధ్యమైన పని నాసా వెల్లడించింది.అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఆ గ్రహశకలం పైనుంచి బంగారాన్ని భూమికి తెచ్చేందుకు సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఫ్యూచర్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాక అక్కడినుండి బంగారం భూమికి తెచ్చేందుకు ప్రయోగాలు జరిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బంగారం లో ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులో నిలువ చేస్తుండగా... కొంతమంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి బంగారాన్ని దాచుకున్నారు . ఇక మిగతా బంగారం నగలు రూపంలో వాడుకలో ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :