Wednesday, September 25, 2019

Good news for Motorists



Read also:

వాహనదారులకు శుభవార్త. ఈ రెండు యాప్స్ తో ట్రాఫిక్ జరిమానాలను తప్పించుకోవచ్చు

సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలు నడిపే వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు.  వాహనదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ (ఆర్సీ) తదితర పత్రాలు కలిగి ఉన్నా.. వాటిని ఇంటి దగ్గర మర్చిపోవడంతో జరిమానా చెల్లించక తప్పడంలేదు. అయితే లైసెన్స్, ఆర్సీ ఫిట్‌నెస్ వాలిడిటీ, ఇన్సూరెన్స్ వాలిడిటీ, పర్మిట్ వాలిడిటీ ఇకపై మీరు వెంట తెచ్చుకోవాల్సిన అవసరంలేదు.  రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ మరియు పియుసి వంటి పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించవచ్చు.

అయితే, చాలా మంది వాహనదారులు పత్రాలను స్కాన్ చేసి, తమకు జరిమానా విధించరు అనే అభిప్రాయంతో వారి ఫోన్‌లో సేవ్ చేస్తున్నారు. అయితే వీటిని అనుమతించరు. రెండు మొబైల్ యాప్స్ ఈ- పత్రాలను పోలీసులకు చూపించి జరిమాన నుంచి తప్పించుకోవచ్చు. డిజిలాకర్(DigiLocker), ఎం పరివాహన్(mParivahan) యాప్స్  ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదిరత పత్రాల సాఫ్ట్ కాపీలను అనుమతిస్తారు.  MParivahan లేదా DigiLocker యాప్స్  లో ఈ-పత్రాలు అందుబాటులో లేకపోతే, వాటిని అసలు పత్రాలతో సమానంగా చట్టబద్ధంగా గుర్తించబడదు.

రహదారి రవాణా మంత్రిత్వ శాఖ యొక్క mParivahan మొబైల్ యాప్‌లో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ వాలిడిటీ, ఇన్సూరెన్స్ వాలిడిటీ, పర్మిట్ వాలిడిటీ వివరాలను రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇకపై వాహనదారులు ఈ రెండు యాప్స్ ద్వారా  ఈ-పత్రాలు పోలీసు అధికారులకు సమర్పించి జరిమాన నుంచి బయటపడవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :