Monday, September 16, 2019

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి



Read also:

కోడెల కన్నుమూత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి చెందారు . హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయనను . . కుటుంబ సభ్యులు బసవతారకం ఆసుపత్రికి తరలించారు . అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారి గుండెపోటు రావడంతో కన్నుమూశారు . ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన . . ఎన్టీఆర్ కేబినెట్ తో పాటు చంద్రబాబు కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు .

కేసులే కారణమా 

వరుస వివాదాలు , పలు కేసుల కారణంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొంతకాలంగా తీవ్ర మనోవేధనతో ఉన్నారు . హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినా . . ఏదొక కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది . తన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వారిపై కేసులు పెట్టుకోవాలని , తనను రాజకీయంగా ఎదుర్కొలేకే . వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన కొంత | కాలంగా అసంతృప్తితో ఉన్నారు .

నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్ అయ్యారు 

పల్నాడు ప్రాంతంలో డాక్టర్ గా కోడెల శివప్రసాద్ కు మంచి పేరుండేది . ఒక డాక్టర్ గా ఆయన చేయి పట్టి వైద్యం చేస్తే ఏ రోగమైనా నయం అవుతుందని పల్నాడు ప్రజలకు నమ్మకం ఉండేది . నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కోడెల . . తన ఇద్దరు చెల్లెళ్లు మసూచీ సోకి చనిపోవడంతో కలత చెంది పట్టుబట్టి మరీ డాక్టర్ చదువును పూర్తి చేశారు . అటు ఆయన వైద్యం కోసం ప్రకాశం జిల్లా నుంచి కూడా రోగులు వచ్చేవారు 

కోడెల నిర్వహించిన పదవులు

1987 - 88 మధ్యలో హోంమంత్రిగా పనిచేశారు  ఆ సమయంలో కాంగ్రెస్ నేత వంగవీటి రంగా హత్యకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి పదవికి కోడెల రాజీనామా చేశారు .
1996 - 97లో భారీ మధ్యతరహా , నీటిపారుదల మంత్రిగా పనిచేశారు 
1997 - 99లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు 
2014 - 2019 వరకూ ఏపీ అసెంబ్లీకి తొలి స్పీకర్గా పనిచేశారు . 

నర్సరావుపేట అంటే కోడెల 


డాక్టర్ చదువుకుని NTR పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల శివప్రసాద్1983లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తొలిసారి MLAగా గెలిచారు . ఆ తర్వాత 1985 , 1989 , 1994 , 1999 ఎన్నికల్లో | నర్సరావుపేట నుంచి వరుసగా గెలిచారు . ఆ తర్వాత 2004 , 2009 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి కోడెల ఓడిపోగా . . 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి , 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు .

ఆరుసార్లు ఎమ్మెల్యే 

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కన్నుమూశారు . 1947 మే2న కండ్లగుంటలో ఆయన జన్మించారు.ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.2014 నుంచి 2019 వరకు స్పీకర్గా పనిచేశారు . 1983లో నర్సరావుపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు . కోడెలకు ఇద్దరు | కుమారులు , ఒక కూతురు ఉన్నారు . గుంటూరు ఏసీ కాలేజీలో పీయూసీ చేసిన కోడెల . . గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు .

బాల్యం, విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు. పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించరు. మా డాక్టర్ కోడెల గారు ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇప్పటికి చెప్పుకుంటారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు. తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అన్న ఎన్టీఆర్ దృష్టి పడింది. పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే దివ్య ఔషదంగా భావించి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఇష్టం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి తారాస్థాయిలో ఉన్నప్పటికీ అన్నగారి పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ). ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

వైద్యవృత్తి

సత్తెనపల్లిలో రావెల వెంకట్రావు అనే వైద్యుడి దగ్గర కొంతకాలం అప్రెంటీస్ గా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అతని దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు తను చదివిన వైద్యవిద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తన స్వంత ఆసుపత్రిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించాడు. వాళ్ళ అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నాడు. అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ, నమ్మకమైన సేవలందిస్తూ, మంచి సర్జన్‌గా పేరుగావించి, మనస్సున్న మారాజుగా మన్ననలు పొంది, వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూ.. డాక్టర్ కోడెల గా గుర్తింపు పొందారు.

రాజకీయ జీవితం


  • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు అప్పట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ కోడెల ఆయన దృష్టిలో పడ్డాడు. అతను పోటీ చేయటానికి ఇష్టపడక పోయినప్పటికీ, నందమూరి తారకా రామారావు 1983 లో ఎన్నికలలో పోటీ చేయటానికి ప్రేరేపించారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల.
  • 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
  • డాక్టర్ కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి విజయం సాదించాడు.
  • నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
  • కోటప్పకొండను అభివృద్ది చేయడంలో భాగంగా ఎన్నో నిధులు మంజూరు చేయి౦చి, ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యముగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందిస్తారు.
  • డాక్టర్ కోడెల... కాకలు తీరిన తెలుగుదేశం సీనియర్ నాయకులు. గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుగాంచి, అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తి ప్రదాతగా ఉన్నారు. అభివృద్ధితోనే అంతరాలు తోలుగుతాయని భావిస్తారు డాక్టర్ కోడెల.
  • గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని డాక్టర్ కోడెల శివప్రసాదరావు జన్మభూమిపై మమకారంతో గ్రామస్తులు మరియు దేశ విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందిచుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్దతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశంను "పల్లెకు పోదాం..." అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా జరుపుతారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అలంకరించి పదవులు

  • 1983-1985 నర్సరావుపేట శాసనసభ్యుడు
  • 1985-1989 నర్సరావుపేట శాసనసభ్యుడు
  • 1987-1988 హోం మంత్రిత్వ శాఖా మంత్రి
  • 1989-1994 నర్సరావుపేట శాసనసభ్యుడు
  • 1994-1999 నర్సరావుపేట శాసనసభ్యుడు
  • 1996-1997 నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ
  • 1997-1999 పంచాయితీ రాజ్ శాఖా మంత్రి
  • 1999-2003 నర్సరావుపేట శాసనసభ్యుడు
  • 2014-2019 సత్తెనపల్లి శాసనసభ్యుడు - ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి, బిజినెస్ ఎడ్ వైజరీ కమిటీ
  • ట్రస్టీ, డాక్టర్ కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్.

విదేశీ పర్యటన


  • 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశంకు హాజరయ్యారు.
  • 27 తేదీ సెప్టెంబర్ నుండి 10 తేదీ అక్టోబర్ 2014 వరకు మారిషస్కు, దక్షిణాఫ్రికా మరియు నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనకు హాజరయ్యారు
  • ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ హాజరయ్యారు మరియు 7 తేదీ నుండి 21 మే 2015 వరకు ప్రీ కాన్ఫరెన్స్ పర్యటన లో పాల్గొన్నారు.
  • కువైట్లో 27 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించిన కువైట్ తెలుగు సంఘం సమావేశంలో పాల్గొన్నారు.
  • సింగపూర్ లో 18 నుండి 20 జూన్ 2015 వరకు జరిగిన స్వచ్చ భారత్ ప్రోగ్రాంలో హాజరయ్యారు
  • లండన్, బ్రిటన్ లో 6 నుండి 10 సెప్టెంబర్ 2015 వరకు జరిగిన చర్చావేదిక " కనెక్ట్ విటి డాట్స్ ప్రోగ్రాం' పై చర్చించటానికి వెళ్లారు.
  • గ్లమన్ కన్సల్టింగ్ మరియు ది భారతదేశం యొక్క కాన్సులేట్ జనరల్, హాంబర్గ్, జర్మనీచే 1 వ నుండి 10 వ నవంబర్ 2015 సంయుక్తంగా నిర్వహంచబడిన 'హాంబర్గ్ ఇండియా-2015' ప్రోగ్రాంకు హాజరయ్యారు.
  • 27 నుండి 29 జనవరి, 2016 వరకు జరిగిన "ఇన్వెస్ట్-ఇన్-ఈస్ట్ -2016" శ్రీలంకలోని కొలంబో లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
  • ఘనా మరియు ఉగాండాలో 09.04.2016 నుండి 14.04.2016 వరకు జరిగిన CPA సమావేశాలకు హాజరయ్యారు.
  • 2 వ నుండి 9 వ మే, 2016 వరకు బ్రెజిల్లో జరిగిన "82 వ ఎపోజూబు" హాజరయ్యారు.
  • 7 వ నుండి 11 వ ఆగస్టు, 2016 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.

కుటుంబం

ఎంబీబీఎస్ చదువుతుండగానే ఆయనకు వివాహమైంది. ఆమె గృహిణి. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్దబ్బాయి క్యాన్సర్ సర్జన్. రెండో అబ్బాయి ఎముకల స్పెషలిస్టు. కానీ రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అభిరుచులు

  • సాహిత్య పుస్తకాలను చదవడం.
  • సంగీతం వినడం.
  • స్విమ్మింగ్.
  • పేదలకు వైద్య చికిత్స అందించడం.
  • మహిళా సాధికారత మరియు ఆరోగ్య సలహాల వంటి సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :