Tuesday, August 27, 2019

మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్ . ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ వాడితే రూ . 21 లక్షలు మీ సొంతం



Read also:

మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్ . ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ వాడితే రూ . 21 లక్షలు మీ సొంతం
ఇంటర్ నెట్ బ్రౌజర్ అనగానే ఫీచర్స్ మాత్రం గొప్పగా ఉంటే సరిపోదు . సెక్యూరిటీ అన్నిటికంటే ముఖ్యం . ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇంకా చెప్పాలంటే నెట్ లేకుండా ఎవ్వరికి క్షణం గడవడం లేదు . అసలు ప్రపంచంలో చాలా మంది నెట్లోనే 24 గంటలు జీవిస్తున్న వారు కూడా ఉన్నారు . 
ఇంటర్ నెట్ ఎంతో పెరిగిపోయిన ఈ కాలంలో - ఆన్లైన్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనది . అందుకే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తన కొత్త క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ ని ఎలాంటి సమస్యలూ లేకుండా బగ్స్ - ఫ్రీ గా చేయాలని నిర్ణయించుకుంది . వాస్తవంగా చూస్తే ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ , ఫైర్ ఫాక్స్ లతో పోటీ పడలేక ఇంతకాలం చతికిలబడింది . అందుకే తన ఎడ్జ్ బ్రౌజర్ కు కొత్త క్రేజ్ తెచ్చేందుకు ఒక ' బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ' ప్రారంభించింది . ఇదేం కొత్తది కాదు . . చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు చేసేదే . కంపెనీలు బీటా వెర్షన్ యూజర్లకి అందించి , దాన్ని వాళ్లు వాడేలా చేస్తారు . అందులో ఏ బగ్స్ ఉన్నాయో కనిపెడితే బహుమతులిస్తారు . ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అదే పంథాను ఫాలో అవుతోంది . ఈ బ్రౌజర్ లో ఏ లోపాలున్నాయో చెబితే - ముఖ్యమైన బగ్స్న గుర్తించినవారికి ముప్పైవేల డాలర్లు బహుమతి ఇస్తోంది . అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 21 లక్షల రూపాయలు . సో మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి . బగ్స్ కనిపెట్టగలిగితే కనిపెడితే ఆ రూ . 21 లక్షలు మీ సొంతం .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :