Monday, August 5, 2019

ఆర్టికల్ 370 రద్దు దీనివల్ల దేశానికీ కలిగే లాభాలు ?



Read also:

ఆర్టికల్ 370 రద్దు  దీనివల్ల దేశానికీ కలిగే లాభాలు ?

అందరూ అనుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లగా కొనసాగుతున్న ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A ను రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వంతంత్ర భారతంలో కాశ్మీర్ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందానికి స్వస్థి పలికినట్లైంది. అమిత్ షా పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ఆరోపించారు. అయితే దేశంలో మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం గమనార్హం. కాశ్మీర్ నాయకురాలు మెహబూబా .. 
article370
అమిత్ షా పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ఆరోపించారు. అయితే దేశంలో మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం గమనార్హం. కాశ్మీర్ నాయకురాలు మెహబూబా .. ఇది కాశ్మీర్ ప్రజలను భయపెట్టి కాశ్మీర్ ను స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయపడింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల నుంచి తీవ్ర ప్రతి ఘటనను బీజేపీ ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇంతక ముందు మెహబూబా పలు సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 ను ముట్టుకుంటే దేశం నుంచి విడిపోతామని చెప్పిన సంగతీ తెలిసిందే. 

అయితే ఈ జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయడం ద్వారా దేశానికీ ఎన్నో లాభాలున్నాయని చెప్పాలి. ఈ నిర్ణయం ద్వారా కాశ్మీర్ ఇప్పుడు దేశంతో పాటు కలిసిపోతుంది. పార్లమెంట్ వేసే చట్టాలన్నీ ఇప్పుడు కాశ్మీర్ కు వర్తిస్తుంది. తద్వారా కాశ్మీర్ లో అభివృద్ధిని సాధించవచ్చు. మిగతా ప్రాంత ప్రజలతో కాశ్మీర్లను ఏకీకృతం చేయొచ్చు. పెట్టుబడుల ద్వారా కాశ్మీర్ ను అభివృద్ధి పధంలో నడిపించవచ్చు. ప్రత్యేక అధికారాలు రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ .. భారత్ లోని మిగతా రాష్ట్రాల మాదిరిగా కేంద్రం అదుపులోకి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఉగ్రవాదులను కంట్రోల్ లో పెట్టొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :