Monday, August 12, 2019

గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవీ.15వ తేది నుంచి అమలు



Read also:

గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవీ.15వ తేది నుంచి అమలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించనున్నట్టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏంటో ఒక్కసారి చూద్దాం:

*వారి గ్రామాల్లో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి.

*తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి.

*విద్య, ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.

*తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రత తదితర వాటిని నిరంతరం పర్యవేక్షించాలి.

*పెన్షన్‌ పంపిణీ, బియ్యం ఇతర నిత్యావసర వస్తువుల డోర్‌ డెలివరీ చేయాలి.

*రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల పంపిణీని వలంటీర్‌ చేపట్టాలి.

*పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో పనిచేసే వలటీర్లు గ్రామ సచివాలయం కోరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి.

*విపత్తుల నిర్వహణ, ఆకస్మిక సంఘటనల నేపథ్యంలో నిర్దేశిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలను అందించాలి.

*మద్యపాన నిషేదం, బాల్యవివాహాలను రూపుమాపేందుకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉంది.

*లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో గ్రామ వలంటీర్లదే కీలక పాత్ర. వినతులు పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించాలి.

*గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలి.

*లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపర్చాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :