Saturday, July 27, 2019

మీ ఫోన్ హాక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా ?



Read also:

మీ ఫోన్ హాక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

మీ ఫోన్లో ఇలా జరిగితే.. ఖచ్చితంగా ట్యాప్ అయినట్టే.. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కలకలం రేపుతోంది. దీని ద్వారా మొబైల్ లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులలు దొంగిలించి అక్రమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాల్లోని సొమ్మును స్వాహ చేస్తున్నారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు మీపై చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ట్రాక్ వ్యూ లాంటి యాప్స్ ఇందుకు బాగా సహకరిస్తున్నాయి. అయితే దీని నుంచి మనల్ని రక్షించుకోవడం ఎలా అనే విషయంపై కొన్ని టిప్స్ ఇస్తున్నాం. - మీ మొబైల్ స్విచ్చాఫ్ చేసిన వెంటనే షట్ డౌన్ కావడం లేదా? స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ ఇండికేటర్ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్ ను ఎవరో ట్యాప్ చేశారని అనుమాన పడొచ్చు.
check phone is hacked or not
ఇలాంటి సందర్భాల్లో ఫోన్ ను ఒక్కసారి రీబూట్ చేయడం మంచిది. - ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే.. మీ ఫోన్ ట్యాపింగ్ కు గురైందని అనుమానించవచ్చు. నెట్ వర్క్ సమస్యల వల్ల వచ్చినప్పటికీ ఫోన్ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తుంటే అనుమానించాల్సిందే. - సౌండ్ బ్యాండ్ విడ్త్ సెన్సార్ అనే పరికరం ద్వారా ట్యాపింగ్ కు గురైన ఫోన్ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కు గురైందని నిర్ధారించుకోవచ్చు. - సెట్టింగ్స్ - బ్యాటరీ సెట్టింగ్స్ - బ్యాటరీ యూసేజ్ ఆప్షన్ తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్, కోకోనట్ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. - మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆన్ ఆఫ్ అవుతోందా? అయితే మీ ఫోన్ ను ఎవరో హ్యాక్ చేసినట్లే.. మీ మొబైల్ లో కొన్ని స్పె యాప్స్ని ఇన్ స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్ను ట్యాప్ చేస్తారు. - గేమింగ్ యాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు కాల్ హిస్టరీ, అడ్రస్ బుక్, కాంటాక్ట్ లిస్ట్ కోసం పర్మిషన్ అడిగితే ఆలోచించుకోవాలి. అందుకే డౌన్ లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం మంచిది. మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్ లో ఎలాంటి యాప్స్ ఇన్ స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్ కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :