Sunday, April 11, 2021

how to get 2000rs for private teachers



Read also:

స్కూల్స్ మూత పడి జీవనానికి కూడా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లుకు ప్రభుత్వం రూ.2000, బియ్యం 25 కిలోల బియ్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా వీటిని ఎలా పొందాలి అనే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం మార్చి 16, 2020 నాటికి గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఈ సాయం పొందేందుకు అర్హులు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేవారు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌ లో అప్ప్లై చేసుకోవల్సి ఉంటుంది.

వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచించారు.

ఈ పత్రాలను ప్రింట్ తీసుకొని సంబంధిత ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అందించాలి, పాఠశాలల యాజమాన్యం డీఈవోకు టీచర్ల వివరాలు అందించాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులు దరఖాస్తు దారులను ధృవీకరించి కలెక్టర్‌కు వివరాలను అందజేస్తారు. కలెక్టర్ తెలంగాణలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ప్రైవేటు టీచర్ల వివరాలను సమర్పిస్తారు. వారికి విద్యాసంస్థలు తిరిగి మొదలు అయ్యే వరకు ప్రతి నెల 25 కిలోల బియ్యాన్ని రూ.2000లను అందించనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :