More ...

Wednesday, April 7, 2021

Election information-ఎన్నికల వాయిదా అని హై కోర్ట్ ఉత్తర్వులు నేపధ్యంలో మనం పాఠశాలల కు వెళ్ళాలా లేదా ఎన్నికల విధులకు వెళ్ళాలా అని సంశయం ఉన్న నేపధ్యంలో పూర్తి వివరణ



Read also:

ఎన్నికల వాయిదా అని హై కోర్ట్ ఉత్తర్వులు నేపధ్యంలో మనం పాఠశాలల కు వెళ్ళాలా లేదా ఎన్నికల విధులకు వెళ్ళాలా అని సంశయం ఉన్న నేపధ్యంలో పూర్తి  వివరణ

ఎన్నికల విథులకే వెళ్ళాలి-Clarification on Election Duty for Today

పోలింగ్ ప్రక్రియ వాయిదా వేసినట్టు గా ఇప్పటి వరకు SEC నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు

ప్రభుత్వం వేసిన పిటిషన్ పై 8 గంటల తరువాత విచారణ, తదుపరి తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఆ తీర్పు తరువాత SEC ఎన్నికల నిర్వహణ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కావున

ఎన్నికల కమిషన్ మనకి ఎన్నికల విధులకు కేటాయించింది. ఎన్నికల కమిషన్ నుండు తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ ఎన్నికల విధులకు కేటాయించబడినవారు అందరూ ఎన్నికల విధుల్లో ఉండాల్సిందే.

పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు కూడా అంత వరకు పోలింగ్ కేంద్రాలుగానే ఉంటాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అవి ఎన్నికల కేంద్రాలు గానే ఉంటాయి. వాటిని నిన్ననే హ్యాండోవర్ చేయడం జరిగింది.  ఎన్నికలు వాయిదా అని SEC నుండి ఆదేశాలు వచ్చే వరకు మనం వాటిని తెరవడానికి వీలులేదు. 

ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఆదేశాలు ఇచ్చే వరకు మనం ఎన్నికల కమిషన్ పరిధిలోనే విధులు నిర్వహించవలసి ఉంటుంది. APTELS లో OTP వస్తే OD అప్లై చేయండి.

AP-Election-news


ఉదయం 8 గంటలకు విచారణ

పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు *ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీల్‌ దాఖలు చేశారు. అందులో... ‘తెదేపా నేత వర్ల రామయ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి కొట్టేసి ఉండాల్సింది. నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదు. ఎన్నికల కోడ్‌ అమలు విషయంలో విచక్షణాధికారం ఎస్‌ఈసీకే ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో అలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో.. ఆ మొత్తం ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న ఒక్క వ్యాఖ్యానానికి భాష్యం చెప్పకూడదు. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేసినప్పుడు.. కోడ్‌ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఈ నేపథ్యంలో కోడ్‌ విధింపును సడలించి, తదుపరి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాలకు ముందు విధించాలని గరిష్ఠ గడువు పెట్టింది...’ అని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్‌పై బుధవారం ఉదయం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం.

AP-Election-news

ఎన్నికలు జరుగుతాయా? జరగవా?

🔸తీవ్ర గందరగోళంలో అధికారులు, ఉద్యోగులు

🔸అర్ధరాత్రి వరకూ టెన్షన్

పరిషత్ ఎన్నికల పై హైకోర్టు సింగిల్ బెంచ్

ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే విషయంలో అర్ధరాత్రి వరకూ టెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రకారం ఎన్నికల కోడ్కు సరిపోయినంత సమయం లేదని, అందువల్లే నూతన. నోటిఫికేషన్ ను నిలిపేయాలని జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజన్ బెంచ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ వచ్చిన తరువాతే డివిజన్ బెంచ్ అప్పీలుకు వెళ్లాల్సి ఉంది. రాత్రి తొమ్మిది గంటలకు ఆర్డర్ కాపీ రావడంతో దాన్ని పరిశీలించి అప్పీలుకు సిద్ధమైందిమరోవైపు వైసిపి నాయకులు ఎన్నికలు జరుగుతాయని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఒకరోజే గడువు ఉండటంతో అధికారులు, ఎన్నికల విధులు నిర్వహించాల్సిన సిబ్బంది తీవ్ర గండరగోశానికి గురయ్యారు. ఎన్నికలు ఉన్నాయనే పేరుతో 7, 8 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎన్నికలు నిలిచిపోతే సెలవులు ఇవ్వాలా, వద్దా అనేది విద్యాశాఖ సందిగ్ధంలో పడింది. బుధవారం ఉదయం నుంచి ఎన్నికల సరంజామా తీసుకుని రాత్రికి ఆయా గ్రామాలకు సిబ్బంది చేరుకోవాల్సి ఉంది. డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ దాఖలు చేయడం, దాన్ని పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం చకచకా జరిగిపోవాల్సి ఉంది. లేనిపక్షంలో రేపు సిబ్బంది విధుల నిర్వహణకు కోర్టు ఆదేశాలు అడ్డు రానున్నాయి. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా సిబ్బంది. ఎన్నికల ప్రక్రియ నిర్వహించకూడదు. అలా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీలును పరిశీలించి అర్ధరాత్రి తరువాత అర్దర్ఇస్తే ఉదయం నుంచి ప్రక్రియ మొదలు పెట్టొచ్చు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ దాఖలు చేసేందుకు రాత్రి 11 గంటల వరకు ప్రధాన న్యాయమూర్తి నుంచి అనుమతి రాలేదు. దీంతో ఎస్ఇసి తరుపు న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అప్పీలుకు వెళుతున్న నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై అన్ని జిల్లాల అధికారులకు తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అప్పీలుకు వెళితే డివిజన్ బెంచ్ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలా? వద్దా? అనే అంశంపై జిల్లా అధికారుల్లో గందరగోళం నెలకొంది. గతంలో వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రక్రియ చేపడతామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు స్పష్టంగా వచ్చే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అతి తక్కువ సమయం కావడంతో సిబ్బంది పైనా మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా ? జరగవా? అనేది డివిజేన్  బెంచ్ ఆదేశాలపై ఆధారపడి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :