Thursday, April 29, 2021

AP SSC Exams: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్-టీచర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు



Read also:

AP SSC Exams: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్-టీచర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.

ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు (Inter Exams) ఏర్పాట్లను చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. పదోతరతి పరీక్షల (SSC Exams) నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది.

జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు కీలక సూచనలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహకరించాలని టీచర్లకు సూచించింది.

మే 1 నుంచి 31వరకు టెన్త్ స్టూడెంట్స్ కు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. ఈ నెలరోజులు వారికి ఆన్ లైన్లో డౌట్స్ క్లియర్ చేయాలని ఆదేశించింది.

అలాగే జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలలకు రిపోర్టు చేయాలని.. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.

పరీక్షల నిర్వహణ, సందేహాల నివృత్తి కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా చేయాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :