Monday, March 1, 2021

The 5 best power foods to control blood sugar through nutrition



Read also:

The 5 best power foods to control blood sugar through nutrition

ప్రస్తుతం లైఫ్ స్టైల్లో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో ముఖ్యమైనది డయాబెటిస్ అని చెప్పుకోవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్య వల్ల శరీరంలోని వివిధ అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా విడుదలవడం.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అలాగే పెరిగిపోతూ ఉండడం ఈ సమస్యకు ముఖ్య కారణం. ఇందులోనూ చాలా రకాలుంటాయి. ఒక్కో రకం డయాబెటిస్ మన శరీరంపై ఒక్కో రకంగా పని చేస్తుంది. అయితే ఏ రకం డయాబెటిస్ అయినా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మన చక్కెర స్థాయిలు పెరగడం ప్రారంభమైందంటే మనం జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. డయాబెటిస్ సమస్య మీలో మొదలైందని చెప్పేందుకు తరచూ మూత్ర విసర్జన, బరువు తగ్గడం, కంటి చూపు లోపాలు, అలసట, ఆకలి, దాహం పెరగడం వంటివి సూచనలుగా చెప్పవచ్చు. మహిళల్లో అయితే వజైనల్ డ్రైనెస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ సంబంధిత సమస్యలు వంటివి కూడా కనిపిస్తాయి. ప్రెగ్నెన్నీలో ఎక్కువగా కనిపించే జస్టేషనల్ డయాబెటిస్ వల్ల బిడ్డకు పోషకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ వచ్చిన వారిలో గుండె పోటు, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మందులు వాడుతున్నా మన జీవన శైలి మార్చుకుంటే తప్ప డయాబెటిస్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కాస్త కష్టమైన పనే.. అందులో ఆరోగ్యకరకమైన కార్బొహైడ్రేట్లు తక్కువగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ముడి ధాన్యాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. డయాబెటిస్ ఉన్న వారు తప్పక తినాల్సిన కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ ఆహార పదార్థాలు వారి డయాబెటిస్ తగ్గించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.
1. టమోటాలు
ఎర్రెర్రని టమోటాలంటే మనకు ఎంతో ఇష్టం. అందుకే దాదాపు అన్ని కూరల్లో దీన్ని ఉపయోగిస్తుంటాం. అందులో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ తో పాటు మరిన్ని దీర్ఘ కాల సమస్యలను తగ్గించే శక్తిని కలిగి ఉంటుందట. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్స్ కాని వారికి కూడా ఇది చాలా మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు.
2. నారింజ
ఆరెంజ్ సిట్రస్ కుటుంబానికి చెందినది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ తీసుకున్నా లేక పండు మొత్తం తిన్నా మంచి ప్రయోజనాలు అందుతాయి. అయితే జ్యూస్ తాగాలనుకుంటే మాత్రం దానికి చక్కెర చేర్చుకుండా జ్యూస్ చేసుకోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండడం, విటమిన్ సి నిండి ఉండడం వల్ల ఇవి డయాబెటిస్ ని సులువుగా అదుపులో ఉంచుతాయి.
3. బీన్స్
బీన్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ తో పోరాడేందుకు మనకు తోడ్పడతాయి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎదురయ్యే సమస్యల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
4. కేల్
ఆకుకూరలన్నీ డయాబెటిస్ ని తగ్గించే బెస్ట్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. కానీ కేల్ లో విటమిన్ ఎ, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మీ రక్తంలోని చక్కెరల స్థాయులను నియంత్రించే పోషకాలు ఎన్నో ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలవచ్చు. దీన్ని కూరగా వండుకొని లేదా ఉడికించుకొని తినవచ్చు. లేదా సలాడ్ లో చేర్చుకోవచ్చు. మరికొందరు ఉదయాన్నే కేల్ జ్యూస్ తాగేందుకు కూడా ఇష్టపడతారు. మీకు ఉదయాన్నే గ్రీన్ జ్యూస్ తాగే అలవాటు ఉంటే అందులో కేల్ ని చేర్చుకోండి.
5. నట్స్
వాల్ నట్స్, అవిసె గింజలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. వీటిలో మెగ్నీషియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి కేవలం డయాబెటిస్ ఉన్నవారికే కాదు.. గుండె పోటు, కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా మంచి ఆహారం గా చెప్పుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కొద్ది పాళ్లలో చక్కెర తీసుకోవాలనుకుంటే దాన్ని నట్స్ తో జోడించి తీసుకోవడం వల్ల ఒకేసారి చక్కెర స్థాయులు పెరగకుండా చూసుకోవచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడూ తమతో పాటు వీటిని తీసుకువెళ్లడం వల్ల బయట ఆహారం తినకుండా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినే వీలుంటుంది.
6. బీట్ రూట్
డయాబెటిస్ ఉన్న వారు తియ్యగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనుకుంటారు. కానీ బీట్ రూట్ దానికి భిన్నం. బీట్ రూట్ తో తయారుచేసిన వంటకాలు ఎంతో రుచిగా తియ్యగా ఉండడంతో పాటు అందులో విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఇందులో లిపోయిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉండడం వల్ల ఇది వయసు పెరుగుతున్న కొద్దీ వస్తున్న సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :