Tuesday, March 2, 2021

Raddish Benefits



Read also:

Raddish Benefits-తరచూ జలుబు, దగ్గు బాధిస్తున్నాయా? ముల్లంగి తినండి వాటిని తరిమికొట్టండి

చలి కాలం పూర్తయి ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఇది. వసంత రుతువు అందాన్ని ఆస్వాదిస్తూనే మన ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేదంటే సీజనల్ సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా సీజన్ మారుతున్నప్పుడు ఎక్కువ మందికి ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యమైనవి జ్వరం, జలుబు, దగ్గు.. వీటి బారిన పడకుండా మన రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తూ రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలిగే శక్తి ఉన్న కూరగాయల్లో ముల్లంగి చాలా ముఖ్యమైనది. తెల్లగా మెరిసిపోతూ ఉండే ముల్లంగి తినేందుకు కాస్త ఘాటుగా అనిపించినా దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాదు.. రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారైతే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వాటిని దూరం చేసుకోవచ్చు. అంతే కాదు.. ఇందులో యాంటీ హైపర్ టెన్సివ్ గుణాల వల్ల మీ రక్తపోటును తగ్గించేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎ, సి, ఇ, బి6, పొటాషియం, ఇతర మినరల్స్ అన్నింటితో నిండి ఉండే ముల్లంగి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంథోసైనిన్లు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. సెక్సువల్ హార్మోన్ల పనితీరు మెరుగుపడేందుకు కూడా ముల్లంగిని ఉపయోగించవచ్చు.

Raddish Benefits

ముల్లంగి రుచి కొందరికి ఇష్టం ఉండదు. కానీ రుచిని ఇష్టపడేవారు మాత్రం వాటిని పచ్చివి కూడా తింటుంటారు. ఉడకబెట్టిన వాటికంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ముల్లంగిని రసం చేసి దాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జలుబు, దగ్గు వంటివి కూడా దూరంగా ఉంటాయి. దీనికోసం ముల్లంగి వీలుంటే పచ్చిగా లేదా కూరల్లో భాగంగా కనీసం వారానికి రెండు సార్లు తీసుకోవడం మంచిది. కేవలం ముల్లంగి దుంపలు మాత్రమే కాదు.. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని తీసుకోవచ్చు. కొంతమంది ముల్లంగి ఆకులతో కూర, పచ్చడి చేసుకుంటుంటారు. ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి ఈ వంటకాలు. ముఖ్యంగా కామెర్లు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగి, ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల సమస్య చాలా తక్కువ సమయంలో తగ్గే అవకాశం ఉంటుంది.

జీర్ణ కోశ సమస్యలు ఉన్నవారికి కూడా ముల్లంగి మంచి మందులా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ రసాలు సరైన మోతాదులో ఉత్పత్తి అయ్యి ఆహారం సులువుగా అరుగుతుంది. ఇందులో ఫైబర్ శాతం కూడా ఎక్కువ కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు. అంతే కాదు.ముల్లంగిలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అరిగేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు కూడా దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఆకలిగా అనిపించకుండానే మీరు బరువు తగ్గే వీలు ఉంటుంది. అయితే మంచిది కదా అని ఎక్కువగా తినడం కూడా సరికాదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :