Monday, March 29, 2021

Fat Burning tip



Read also:

Fat Burning tip: జీలకర్రలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీలకర్ర నీటికి ఈ విధంగా తాగేవారు ఈజీగా బరువు తగ్గిపోతున్నారు. ఆ ఫాట్ బర్నింగ్ చిట్కా ఏంటో తెలుసుకుందాం.

Fat Burn: చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా చాలా మంచిది. ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. దీనికి చెయ్యాల్సిందల్లా. రోజువారీ తీసుకునే ఆహారంలో. జీలకర్ర నీరును కూడా చేర్చాలి. రోజూ రాత్రివేళ ఓ టీ స్పూన్ జీలకర్రను ఓ గ్లాస్ నీటిలో నానబెట్టాలి. తెల్లారి ఆ నీటిని తాగేయాలి. దాని వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం మెరుస్తుంది.

ఇలా రోజూ చేస్తూ ఉంటే. మన శరీరంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారవుతుంది. తిన్న ఆహారం కొవ్వులా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జీర్ణం అయిపోతుందని అధ్యయనాల్లో తేలింది. లివర్‌లో విషపూరిత వ్యర్థాలు ఉంటే. జీలకర్ర నీరు వాటిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా లివర్ బాగా పనిచేస్తుంది.

జీలకర్రలోని కొన్ని ఔషధ గుణాలు. నీటి ద్వారా శరీరంలోకి వెళ్తాయి. దాంతో. ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి. రకరకాల శ్వాస కోస సమస్యలకు జీలకర్ర నీరు పరిష్కారం చూపిస్తుంది. శ్వాస బాగా ఆడుతుంది. అందువల్ల రోజూ ఉదయం వేళ జీలకర్ర నీరు తాగితే మంచిది.

తిన్న ఆహారం పేగుల్లోనే ఉండిపోతే. కొన్ని రకాల నూనెలు పేగుల గోడలకు అంటుకొని అట్లాగే నిల్వ ఉంటాయి. అవన్నీ పొట్టలో రకరకాల వ్యాధులు, అనారోగ్యాలకు కారణం అవుతాయి. అందువల్ల తిన్న ఆహారం కచ్చితంగా జీర్ణం అయ్యేలా చేసుకోవాలి. అందుకు జీలకర్రను నానబెట్టిన నీరు చక్కగా ఉపయోగపడుతుంది.

జీలకర్రలో ఫైబర్ ఎక్కువ. ఫైబర్ అనేది. పొట్టలోకి వెళ్లాక. జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. పైగా ఆకలి ఎక్కువగా వెయ్యకుండా చేస్తుంది. అందువల్ల ఈ నీరు తాగిన వారికి ఆకలి అంతగా వెయ్యదు. బాడీలో చెడు కొవ్వు కరిగిపోతూ ఉంటే. ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం పొట్టే. పొట్టను తగ్గించుకుంటే. దాని చుట్టూ కొవ్వు కూడా తగ్గుతుంది. ఫలితంగా బాడీపై మనకు కంట్రోల్ వస్తుంది. చురుగ్గా తయారవుతాం. దాంతో. బరువు తగ్గడానికి ప్రయత్నాలు గట్టిగా చేసేందుకు వీలవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :