Monday, March 29, 2021

Details of the 12 new rules coming into force in the month of April



Read also:

Details of the 12 new rules coming into force in the month of April-ఏప్రిల్‌ నెలలో అమల్లోకి రాబోతున్న 12 కొత్త రూల్స్ వివరాలు

1.మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 31  పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ.

2.ఇటివల ఎనిమిది  ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా  మార్చారు . దీంతో ఏప్రిల్ 1 నుంచి పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్  పనిచేయవు.

3.ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి.

4. ఇకపై  ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.

5.మార్చి 31న ఎల్‌టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.

6.ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్‌పై ఎక్కువ రేట్ వసూలు చేయనున్నారు.

7.ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.  ప్రభుత్వం వారికి పన్నులను బ్యాంకులనే నేరుగా డిడక్ట్ చేస్తుంది.

8.కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది.మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.

9.ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది.

10.ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి.

11.టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది.

12.ఏప్రిల్ 1న టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీల ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :