Monday, March 29, 2021

Andhra Pradesh Budget: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇవే ఏ శాఖకు ఎంత ఇచ్చారంటే



Read also:

Andhra Pradesh Budget: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇవే ఏ శాఖకు ఎంత ఇచ్చారంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) మూడు నెలల కాలానికి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) ను ఆమోదించిన సంగతి తెలిసిందే. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంక్షేమం తర్వాత వ్యవసాయం, విద్యారంగాలకు భారీగా కేటాయింపులు జరిపారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలోని తొలి మూడు నెలలకు మొత్తం 70,983.11 ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ కు రాష్టచ్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఆర్డినెన్స్ ను గెజిట్ గా ప్రచురించేందుకు న్యాయశాఖ కార్యదర్శి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు.

తర్వాత ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్ఎస్ రావత్.. ఆర్డినెన్స్ పై ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల హెచ్ఓడీలు, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్లు ఆయా శాఖలకు కేటాయించిన నిధులకంటే మించి ఖర్చు చేయడానికి వీల్లేదన్నారు.

బడ్జెట్ లో రూ.63.020.55 కోట్లను వివిధ శాఖలు ఖర్చు చేసేందుకు అంచనా వేస్తూ ఓట్ ఆన్ ఎకౌంట్ లో పొందుపరిచారు. అలాగే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వ్యయాల కింద రూ.7,962.55 కోట్లు కేటాయించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు మెరుగైన కేటాయింపులు చేసింది. ముఖ్యంగా సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజనులు, మైనార్టీల సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమానికి కలిపి మొత్తం రూ.10వేల కోట్లకు పైగా దక్కింది. సంక్షేమ తర్వాతి స్థానంలో ఉన్న వ్యవసాయరంగానికి రెవెన్యూ వ్యయం కింద రూ.7,171.26 కోట్లు, పెట్టుబడి వ్యయం కింద రూ.167.64 కోట్లు కేటాయించారు. రైతు భరోసా నిధుల కోసం ఈ స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.

విద్యారంగానికి 7,972 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యాకానుక, నాడు -నేడు పథకాల కోసం విద్యారంగానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.2వేల కేటాయించగా.. మొత్తంగా నీటిపారుదల శాఖకు రూ.2,653 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.3.567 కోట్లు కేటాయించారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 7,955.66 కోట్లతో అనుబంధ పద్దుకు కూడా ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఆర్డినెన్సు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2020-21లో గత ఏడాది నవంబరు 26 నుంచి 2021 మార్చి 31 వరకు బడ్జెట్ కేటాయింపులకంటే అదనంగా ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంతో ఆ అనుబంధ పద్దునూ మంత్రిమండలి ఆమోదించడంతో గవర్నర్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ కింద కేటాయించిన రూ.రూ.13.59 కోట్లు, శాఖల వారీగా అదనపు ఖర్చుకు రూ.7,942.07 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు ప్రభుత్వం తెలిపింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :