Monday, March 29, 2021

ఈ ఎండాకాలంలో AC కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 14 విషయాలు తప్పక తెలుసుకోండి



Read also:

ఎండాకాలం ప్రారంభమవడంతో ప్రజలంతా ఏసీలు, కూలర్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. అనేక మంది ఆన్లైన్లోనే ఏసీలు, ఇతర వస్తువులు కొంటుంటారు. ఆఫర్లు అధికంగా ఉండడం, ఇంటికి డెలివరీ చేయడం తదితర అంశాలే ఇందుకు కారణం. అయితే ఏదో ఒకటి చూసి బుక్ చేసుకోవడం కంటే కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఏసీని బుక్ చేసుకోవడం మంచిది. తద్వరా మనకు ఏసీని ఏళ్ల తరబడి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు. ఏసీని కొనే ముందు కేవలం కంపెనీని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏసీ కొనాలని భావిస్తే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి.

1. ఏసీ కొనే ముందు మోడల్ నంబర్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను అధికారిక వెబ్ సైట్లో తనిఖీ చేసుకోవాలి.


2. ఏసీ కొనే ముందే వివిధ డీలర్ల వద్ద ధరను చెక్ చేసి పోల్చి చూడాలి. వివిధ ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లలోనూ ధరను పోల్చి చూడాలి. ఒరిజినల్ ధర ఎంత ఉంది? ఎంత మేర డిస్కౌంట్ అందిస్తున్నారు? తదితర వివరాలను చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే సాధ్యమైనంత తక్కువ ధరకు కావాలనుకున్న ఏసీని సొంతం చేసుకోవచ్చు.
3. ఏసీ కొనే ముందు వినియోగదారులు వారంటీని తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా ప్రొడక్ట్ పై ఏడాది, కండెన్సర్ పై ఏడాది, కంప్రెసర్ పై ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. ఏసీ కొనే ముందు ఈ వివరాలను తెలుసుకోవడంతో పాటు ఇతర బ్రాండ్లతో పోల్చి చూడడం మంచిది.

4. సాధారణంగా వివిధ ఈ కామర్స్ వెబ్ సైట్లు ఫ్రీగానే ఏసీలను డెలివరీ చేస్తాయి. అయితే మనం ముందుగానే ఏమైనా ఎక్స్ట్రా చార్జీలు పడుతున్నాయా? అన్న వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది.
5. ఏసీ కొనడంతోనే డబ్బుల పని అయిపోతుంది అనుకుంటే పొరపాటే. ఏసీ ఖర్చుతో పాటు ఇన్స్టలేషన్ చార్జీలు కూడా ఉంటయన్న విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. ఈ చార్జీలు సాధారణంగా రూ. 1600 నుంచి రూ.2 వేల వరకు ఉంటాయి. ఏసీ బుక్ చేసుకునే ముందే ఈ విషయంపై క్లారిటీగా తెలుసుకోవడం మంచిది.

6. ఇన్స్టలేషన్ కిట్ ఛార్జీలు: కొన్ని బడ్జెట్ స్ప్లిట్ ఏసీ మోడళ్లకు కాపర్ పైపులను కంపెనీలు ఇవ్వవు. అలాంటి ఏసీలు కొన్న సమయంలో ఏసీ, అవుట్ డోర్ యూనిట్లకు మధ్య కాపర్ పైపులకు కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
7. మన ఇంటికి అనుగుణంగా విండో ఏసీ కావాలా? స్ప్లిట్ ఏసీ కావాలా? అన్న విషయాన్ని ముందుగానే నిర్ణయించాకోవాలి.
8. ఏసీ కొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఖర్చలు ఏవీ ఉండవు అనుకుంటే పొరపాటే. ఏసీ సర్వీస్ ఖర్చులు ఉంటాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. సాధారణంగా స్ప్లిట్ ఏసీకి సర్వీస్ ఛార్జీలు ఉంటాయి. విండో ఏసీ మోడళ్లకు సర్వీస్ చార్జీలు స్ప్లిట్ ఏసీలతో పోల్చితే తక్కువగా ఉంటుంది.

9. సాధారణంగా ఏసీ వాడితే వేలకు వేలు కరెంట్ బిల్ వస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు మోటార్ స్పీడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇలాంటి ఏసీలకు పవర్ బిల్ తక్కువగా వస్తుంది.
10. ఏసీలో ఎయిర్ ఫ్లోపై మన కంఫర్ట్ ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏసీలు చాలా దూరం వరకు గాలిని ఫ్లో చేస్తాయి. ఏసీ కొనే సమయంలో ఈ విషయాన్ని గమనించాలి.
11. BEE స్టార్ రేటింగ్ ను ఏసీ కొనే సమయంలో తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా 5 స్టార్ ఉండే ఏసీలకు అధిక ధర ఉంటుంది. తగిన బడ్జెట్ మనకు అందుబాటులో ఉంటే 5 స్టార్ ఏసీలు కొనడం మేలు.

12. ఏసీని కొనే ముందు ఏసీ మోడల్ సైజ్ కెపాసిటీని చెక్ చేసుకోవడం మంచిది.
13. ఏసీ కొనే ముందు ఏ ఫ్లోర్ లో మనం ఉంటామన్న విషయాన్ని కూడా పరిగణలోకి తసుకోవాలి. సాధారణంగా 1.5Ton ఏసీని ఇండియాలో అధికంగా వినియోగిస్తారు. మనం ఏసీని ఉంచే రూమ్ పెద్దదిగా ఉండి టాప్ ఫ్లోర్ లో ఉంటే 2Ton ఏసీని తీసుకోవడం మేలు. రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే 1Ton ఏసీని తీసుకోవడం మంచిది.
14. ఏసీని కొనే ముందు దానిని నుంచి వచ్చే శబ్ధాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ శబ్ధం వచ్చే ఏసీలు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. శబ్ధం 40dB కన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :