Thursday, February 18, 2021

State Bank of India personal loan with missed call



Read also:

State Bank of India personal loan with the missed call

State Bank of India: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).తన కస్టమర్లకు చాలా వేగంగా, వెంటనే లోన్ ఇచ్చేందుకు సరికొత్తగా ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ (Xpress Credit personal loan) సదుపాయం తెచ్చింది. పెళ్లి కోసం లోన్ కావచ్చు లేదా వేకేషన్ కోసం కావచ్చు లేదా సడెన్‌గా ఎమర్జెన్సీ అవసరం కోసం కావచ్చు లేదా.ఏదైనా వస్తువు కొనేందుకు కావచ్చు. అవసరం ఏదైనా సరే.యక్ష ప్రశ్నలతో పనిలేకుండా ఇప్పుడు ఎస్బీఐ కస్టమర్లు.వెంటనే రుణం పొందగలరు. లోన్ డబ్బు కూడా వెంటనే ఇస్తారు. ఇందుకోసం ఇవ్వాల్సిన డాక్యుమెంట్ల ప్రక్రియను ఈజీగా మార్చేశారు. అందుకోసమే ఈ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ విధానం తెచ్చింది బ్యాంక్. అదేంటో తెలుసుకుందాం.

ఈ తరహా లోన్ కావాలనుకునే కస్టమర్లు జస్ట్ ఓ మిస్డ్‌కాల్ ఇస్తే సరిపోతుంది. లేదంటే ఓ మెసేజ్ పంపినా పర్వాలేదు. ఇందుకు సంబంధించి ఎస్బీఐ ఓ ట్వీట్ చేసింది. అందులో ఇలా చెప్పింది. "మీ వ్యక్తిగత రుణాల ప్రక్రియ ఇప్పుడు ఒకే ఒక్క SMSతో జరిగిపోతుంది. ఇందుకోసం మీరు PERSONAL అని టైప్ చేసి.7208933145కి SMS పంపండి" అని చెప్పింది.

SBI Interest Rate:

ప్రస్తుతం SBIలో వ్యక్తిగత రుణం తీసుకుంటే దానిపై వడ్డీ 9.60% గా ఉంది.

SBI Xpress Credit Personal Loan Features:

కొత్తగా తెచ్చిన ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ద్వారా ఎలాంటి సదుపాయాలు, ఎంత లోన్ ఇస్తారో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం.

  • - రూ.20 లక్షల వరకూ లోన్ తీసుకోచ్చు.
  • - వడ్డీ రేటు తక్కువే.
  • - బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి వడ్డీని రోజూ వసూలు చేస్తారు.
  • - ప్రాసెసింగ్ ఛార్జీలు తక్కువే.
  • - డాక్యుమెంట్లు ఎక్కువగా అవసరం లేదు.
  • - రహస్య ఛార్జీలు ఏవీ లేవు.
  • - రెండో లోన్ కూడా పొందేందుకు వీలు
  • - స్క్రూటినీ అనేది లేదు. ఎవరూ గ్యారెంటీ ఇవ్వాల్సిన పనిలేదు.

Missed Call Number:

మరి పైన చెప్పుకున్న మిస్డ్ కాల్ ఎలా ఇవ్వాలి అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. అది తెలుసుకుందాం. ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ద్వారా లోన్ పొందేందుకు మీరు 7208933142 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు కాల్ చేయగానే వాళ్లు రిసీవ్ చేసేసుకుంటారేమో అని అనుకోవద్దు. అలా జరగదు. మీరు కాల్ చేశాక.ఓ మూడుసార్లు రింగ్ అయి.తర్వాత ఆగిపోతుంది. తర్వాత వాళ్లే మీకు కాల్ చేసి.లోన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

మీకు మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే మీరు 1800-11-2211 కి కాల్ చేసి మీ సందేహాలు అడగచ్చు. ఇది ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ నెంబర్. వాళ్లు అన్ని సందేహాలూ నివృత్తి చేస్తారు.

SMS Number:

పైన చెప్పుకున్నట్లు మీరు SMS పంపితే.మీకు ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. లోన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :