Thursday, February 18, 2021

SBI with aadhar Key decisions



Read also:

బ్యాంక్ అకౌంట్లను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఖాతాదారులు తమ అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేయడం సాధ్యం కాదు. మార్చి 31 లోపు అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లను ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు SBI కస్టమర్లు SMS, ATM, నెట్‌బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా బ్రాంచ్‌లో సంప్రదించి తమ సేవింగ్స్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. వివిధ పద్ధతుల్లో బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో ఎలా అనుసంధానం చేయాలో చూద్దాం.

నెట్ బ్యాంకింగ్

SBI కస్టమర్లు నెట్‌బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌ను సులభంగా ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఇందుకోసం ముందు ఖాతాదారులు www.onlinesbi.com వెబ్‌సైట్‌కు వెళ్లి నెట్‌బ్యాంకింగ్‌ సేవల కోసం సైన్ ఇన్ కావాలి. వెబ్ పేజీలో కనిపించే ‘e-Services’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. ‘అప్‌డేట్ ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్స్ (CIF)’ విభాగం కనిపిస్తుంది. దీన్ని ఎంచుకొని ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ధ్రువీకరించాలి. డ్రాప్ డౌన్ లిస్ట్‌లో CIF నంబరు, ఆధార్ నంబరు నమోదు చేయాలి. (CIF నంబరు మీ బ్యాంక్ పాస్ బుక్ పై అకౌంట్ నంబర్ తో పాటే ముద్రితమై ఉంటుంది.) అన్ని వివరాలు నింపిన తరువాత 'Submit' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ విధానంలో ఆధార్ వివరాలు సేవింగ్స్ అకౌంట్‌కు వెంటనే అనుసంధానం అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు మెసేజ్‌ కూడా వస్తుంది.

ATM ద్వారా

నెట్ బ్యాంకింగ్ సర్వీస్‌ వాడనివారు ATM ద్వారా SBI సేవింగ్స్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఏదైనా SBI ఏటీఎంకు వెళ్లి.. డెబిట్ కార్డును కార్డు స్లాట్‌లో పెట్టాలి. పిన్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత.. డిస్‌ప్లేపై కనిపించే ‘Service Registration’ విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత ‘Aadhaar Registration’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అకౌంట్ రకాన్ని, ఆధార్ నంబరును నమోదు చేయాలి. ఖాతాదారుల రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిన తరువాత అకౌంట్ ఆధార్‌కు లింక్ అవుతుంది.

SBI మొబైల్ యాప్ ద్వారా

స్మార్ట్‌ఫోన్‌లో SBI ఎనీవేర్ పర్సనల్ మొబైల్ యాప్ ఓపెన్ చేసి ‘Requests’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ లిస్ట్‌లో కనిపించే ‘Aadhaar Linking’ విభాగాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ కస్టమర్ల CIF నంబరు, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ధ్రువీకరించాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను యాక్సెప్ట్ చేసి వివరాలను సబ్మిట్‌ చేయాలి. అనంతరం అకౌంట్ ఆధార్‌తో లింక్ అయినట్లు నోటిఫికేషన్ వస్తుంది.

SMS ద్వారా

బ్యాంక్ అకౌంట్‌తో మొబైల్ నంబరు రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారులు SMS ద్వారా అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. మెసేజెస్ విభాగంలో UID(స్పేస్) ఆధార్ నంబరు(స్పేస్)అకౌంట్ నంబరు టైప్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 567676కు SMS పంపాలి. బ్యాంకు కస్టమర్ల రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన తరువాత అకౌంట్‌, ఆధార్ లింక్ అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది.

SBI బ్యాంక్ బ్రాంచి ద్వారా

బ్యాంక్ బ్రాంచిలో సులభంగా అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకు ఒక దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. ఆ తరువాత దీన్ని ఖాతాదారుడు సంతకం చేసిన ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో కలిపి అధికారులకు ఇవ్వాలి. అవసరమైతే ఒరిజినల్ ఆధార్ కార్డును బ్యాంకులో చూపించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత కస్టమర్లకు ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. బ్యాంకు ఈ రిక్వెస్ట్‌ను ఆమోదించిన తరువాత అకౌంట్‌ ఆధార్‌తో లింక్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :