Saturday, February 20, 2021

Savings Accounts interest rates



Read also:

Savings Accounts: ఈ బ్యాంకుల్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? మీకు లభించే వడ్డీ రేట్లను తెలుసుకోండి

మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న నగదుపై ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసా? సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ గురించి ఎక్కువ మంది పట్టించుకోరు. కానీ, దానిపై కూడా వడ్డీ లభిస్తుంది. అయితే, ఫిక్స్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే, ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు చాలా తక్కువ వడ్డీని అందిస్తుంటాయి. దీంతో సేవింగ్స్ అకౌంట్లో నగదు జమచేసే వారి సంఖ్య తగ్గుతోంది. దీన్ని గుర్తించిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐడిబిఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వాటిని పరిశీలిద్దాం.

సేవింగ్స్ అకౌంట్పై వడ్డీరేట్లు

బ్యాంక్‌బజార్ అందించిన డేటా ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పై 3.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్లు 3.2 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీరేట్లతో పోల్చినప్పుడు ఈ వడ్డీ రేట్లు పోటాపోటీగా ఉంటాయి. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 3 శాతం నుంచి 3.5 శాతం వడ్డీని అందిస్తుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.5 శాతం నుంచి 4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ఇవి తక్కువ వడ్డీనే అందిస్తున్నప్పటికీ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఇవి అందించే వడ్డీ ఎక్కువ అనే చెప్పవచ్చు. ఉదాహరణకు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కేవలం 2.70 వడ్డీరేటునే చెల్లిస్తుంది. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందజేస్తున్నాయి. ఉదాహరణకు, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లు వరుసగా 6 శాతం, 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

బ్యాంకు వడ్డీరేటు (ఏడాదికి) మినిమం బ్యాలెన్స్

 ఐడీబీఐ బ్యాంక్ 3.00%–3.50% రూ.500–రూ.5,000

 కెనరా బ్యాంక్ 2.90%–3.20% రూ.500–రూ.1,000

 బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75%–3.20% రూ.500–రూ.2,000

 పంజాబ్ అండ్ సింధ్ 3.10% రూ.500–రూ.1,000

 ఇండియన్ ఓవర్సీస్ 3.05% రూ.500–రూ.1,000

 యూనియన్ బ్యాంక్ 3.00% రూ.250–రూ.1,000

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.00% రూ.500–రూ.2,000

 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.75%–3% రూ.500–రూ.2,000

 బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.90% రూ.500–రూ.1,000

 ఇండియన్ బ్యాంక్ 2.90% రూ.500–రూ.2,500

ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువ

కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు తక్కువ వడ్డీ అందిస్తున్నప్పటికీ, ఇవి అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కస్టమర్లను చేరుకోవడానికి ఇవి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. అందువల్లే, వీటిలో మినిమం బ్యాలెన్స్ నిబంధన చాలా తక్కువగా ఉంటుంది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ రూ. 250 నుండి మొదలవుతుంది. అదే ప్రైవేటు రంగ దిగ్గజాలు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లలో మినిమం బ్యాలెన్స్ నిబంధన రూ.2,500 నుంచి రూ .10,000 వరకు ఉంటుంది. ఇక, ఐసిఐసిఐ బ్యాంక్ విషయంలో ఇది రూ .1,000 నుండి రూ. 10,000 వరకు ఉంటుంది. అయితే, సేవింగ్స్ అకౌంట్ విషయంలో వడ్డీరేటుకు బదులు బ్యాంకు అందించే ఇతర సేవలను, విస్తృత బ్రాంచ్ నెట్‌వర్క్, ఏటిఎం సేవలను పరిగణలోకి తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయడం ఉత్తమం. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ పై వచ్చే వడ్డీ బోనస్ క్రిందే పరిగణించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :