Tuesday, February 23, 2021

PM KISAN: పీఎం కిసాన్ పథకం అనంతపురం జిల్లాకు నేషనల్ అవార్డ



Read also:

 PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్‌లో అనంతపురం జిల్లా సత్తా చాటింది. దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్‌లో అనంతపురం జిల్లా సత్తా చాటింది. దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో 99.6 శాతం ఫిజికల్ వెరిఫికేషన్‌ను అనంతపురం జిల్లా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాను నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం.

ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేషనల్ అవార్డును అందుకోనున్నారు.

కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను పరిశీలించారు.

అనంతపురంలోని 63 మండలాల్లో మొత్తం 5,76,972 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 28,269 మంది లబ్ధిదారులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. నిర్దేశించిన లక్ష్యంలో 99.6 శాతం పూర్తయింది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6వేల సాయం అందిస్తారు. ఐతే ఈ రూ.6వేలను ఒకేసారి జమచేయరు.

ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున డబ్బులు జమ చేస్తారు. అంటే, ఏడాదికి మూడు ఇన్ స్టాల్‌మెంట్ల కింద డబ్బులను అందజస్తారు. ఈ డబ్బులను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేస్తారు.

ప్రతిఏటా డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతులకు అందిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :