Saturday, February 13, 2021

Pension news



Read also:

Pension: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో తనదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పెన్షన్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుందో, దాని వల్ల ఏం ప్రయోజనమో తెలుసుకుందాం.

ఇప్పటివరకూ దేశంలో ఫ్యామిలీ పెన్షన్ల నెలవారీ గరిష్ట పరిమితి (upper ceiling) రూ.45,000 వరకే ఉంది. దాన్ని రూ.1,25,000కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెన్షన్లు ప్రజా సమస్యలు, ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ స్వతంత్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా. ఉద్యోగులు చనిపోయిన కుటుంబ సభ్యులు జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. అలాంటి కుటుంబాల వారికి తగినంత ఆర్థిక రక్షణ లభిస్తుందని చెప్పారు.

తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే. వారు కొడుకు లేదా కూతురు... రెండు ఫ్యామిలీ పెన్షన్లను తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటే. ఎంతవరకూ అమౌంట్ పొందవచ్చు అనే అంశంపై వచ్చిన సందేహానికి పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ విభాగం (DoPPW) సమాధానం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్లు నెలకు రూ.1.25 లక్షలకు మించకూడదని DoPPW విభాగం తెలిపింది. ఆ రకంగా చూస్తే. ఇప్పటివరకూ ఉన్న పరిమితి కంటే ఇది 2న్నర రెట్లు ఎక్కువ అని మంత్రి తెలిపారు.

1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్‌లోని 54వ రూల్‌లో 11వ ఉప నిబంధన ప్రకారం. భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగులై ఉండి. వారు చనిపోతే. వారి బిడ్డ. వారిద్దరి పెన్షన్లూ పొందేందుకు వీలుంది. 

ఇంతకు ముందు 2 కుటుంబ సభ్యుల పెన్షన్లు నెలకు రూ.45,000, రూ.27,000కు మించకూడదు. తాజాగా ఏడో వేతన సంఘం ప్రతిపాదనలతో ఈ రూల్స్‌లో మార్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల నెల వారీ పెన్షన్ గరిష్ట పరిమితిని రూ.1,25,00, రూ.75,000 కింద మార్చారు. ఆ రకంగా చూస్తే. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయన ప్రభుత్వ ఉద్యోగుల కొడుకు లేదా కూతురు నెలకు రూ.2,50,000 పెన్షన్ పొందే వీలు ఉంది.

ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే. వారి భాగస్వామికి ఆ పెన్షన్ దక్కుతుంది. భర్త చనిపోతే, భార్య పెన్షన్ పొందుతుంది. ఆమె కూడా చనిపోతే. అప్పుడు ఇద్దరి పెన్షన్లనూ వారి బిడ్డ పొందుతారు. ఇందుకు సంబంధించిన అర్హతలను వర్తించేలా చేసుకోవాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :