Monday, February 22, 2021

New PF tax rules from April 1



Read also:

New PF tax rules from April 1

మీరు పీఎఫ్ ఖాతాదారులా? అయితే ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి టాక్స్ మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ నుంచి ఈ నిబంధనల నుంచి మార్పులు రానున్నాయి

  • మీరు పీఎఫ్ ఖాతాదారులా? అయితే ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి టాక్స్ మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ నుంచి ఈ నిబంధనల నుంచి మార్పులు రానున్నాయి.
  • ఈపీఎఫ్ లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు.
  • ఏడాదికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ .2.5 లక్షలకు మించితే అందుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 1, ఏప్రిల్ 2021 నుంచి ఇది అమలులోకి వస్తుంది.
  • పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80సీ కింద ఎప్పటిలానే మినహాయింపు లభించనుంది. పీఎఫ్‌లో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
  • పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు అతను పని చేస్తున్న సంస్థ కూడా ఉద్యోగి తరఫున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం ఈ ట్యాక్స్ ను లెక్కిస్తారు.
  • ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌ పరిధిలోకి వస్తే అతను 30 శాతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది.
  • రూ.2.5 లక్షలకు లోపు పీఫ్ జమ చస్తే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అలాంటి వారు నూతన ట్యాక్స్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ విషయంపై త్వరలోనే ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :