Sunday, February 21, 2021

NASA Asteroid-12 ఏళ్ల పశ్చిమ గోదావరి జిల్లా బాలిక-గ్రహశకలాన్ని కనిపెట్టింది



Read also:

NASA Asteroid: చిత్రంగా లేదు. అంతరిక్షంలో ఉన్న ఓ రాయి (గ్రహశకలం)ని ఓ 12 ఏళ్ల విద్యార్థిని ఎలా కనిపెట్టింది. అసలు ఆమెకు అది గ్రహశకలం అని ఎలా తెలిసింది

ఈ విశ్వం అద్భుతమైనది. ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, సూపర్ నోవాలు... ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. అందుకే ఎప్పుడైనా లైఫ్ బోర్ కొడితే.రాత్రివేళ అంతరిక్షాన్ని చూడమని అంటారు పెద్దలు. ఎందుకంటే.అలా చూస్తున్నప్పుడు మనలో విశాల భావాలు కలుగుతాయి. ఉల్కలు, తోకచుక్కల వంటివి అలా వెళ్తూ కనిపిస్తూ.మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. దాంతో బోర్ పోయి.ఎదో కనిపెట్టాలనే ఆశ కలుగుతుంది. దాని నుంచి జీవితంపై ఆసక్తీ పెరుగుతుంది. సరే అసలు విషయానికి వద్దాం.

NASA Asteroid

ఆంధ్రప్రదేశ్.పశ్చిమ గోదావరి జిల్లా.నిడదవోలులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతోంది 12 ఏళ్ల కుంచల కైవల్యారెడ్డి. దేశం గర్వపడే ఓ పని చేసిందీ బాలిక. తాజాగా ఆమెకు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ రీసెర్చ్ కొల్లాబరేషన్ (IASC) సంస్థ నుంచి ఓ సర్టిఫికెట్ వచ్చింది. ఎందుకంటే.ఆమె ఓ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఇదెలా సాధ్యమైంది? ఎక్కడో అంతరిక్షంలో ఇప్పటివరకూ ఎవరూ చూడని గ్రహశకలాన్ని ఆమె ఎలా కనిపెట్టింది?

హవాయ్ లోని పాన్ స్టార్స్ (PAN STARRS) టెలిస్కోప్ తీసిన అంతరిక్షం ఫొటోలను లోతుగా పరిశీలించింది. మార్స్ (Mars), గురుగ్రహం (Jupiter) మధ్య తిరిగే ఓ గ్రహశకలాన్ని గుర్తించింది. ఇలా గుర్తించడం మామూలు వాళ్లకు కష్టం. ఇందుకు ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ బాలిక ఢిల్లీకి చెందిన స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. తద్వారా గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాల్ని గుర్తించడం నేర్చుకుంది.

ఇదంతా చదివాక మీకు కూడా అలా ఏదైనా కనిపెట్టాలని అనిపిస్తోందా.మీరు ట్రైనింగ్ తీసుకోకపోయినా.అలాంటి అంతరిక్ష ఫొటోలను చూడొచ్చు. అందుకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. https://hubblesite.org/resource-gallery/images ఈ లింకులో ఉన్నవి పాన్ స్టార్స్ టెలిస్కోప్ తీసిన ఫొటోలే. మరిన్ని ఫొటోలు చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి. https://hubblesite.org/images/gallery వీటి ద్వారా మీరు కూడా అంతరిక్ష పరిశోధకులు అయిపోతారు. ఏమో మీరే ఏదో ఒక రోజు ఓ కొత్త గ్రహాన్ని కనిపెడతారేమో.ఎవరికి తెలుసు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :