Tuesday, February 23, 2021

Nadu Nedu News



Read also:

పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం వారం రోజులే గడువున్నా 39.67శాతమే పూర్తి ఫర్నీచర్‌ సరఫరా 4.41శాతమే 

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మన బడి ‘నాడు-నేడు’ మొదటి దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనుల పెండింగ్‌ వల్ల కొన్నిచోట్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల మరమ్మతు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, రంగుల పనులు కొనసాగుతుండడంతో పిల్లలు ఆరుబయట కూర్చొని పాఠాలు వింటున్నారు. తరగతి గదులు, ఆవరణల్లో నిర్మాణ సామగ్రి వేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ విద్యార్థులను కూర్చోబెట్టడం సమస్యగా మారుతోంది. విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడంతో గదుల కొరత ఏర్పడుతోంది.

మార్చి 10న సెలవు. కలెక్టర్లకు ఏపీ SCE ఆదేశం-Click Here

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక భీమా పథకం - 01.07.2020 నుండి 30.09.2020 వరకు వడ్డీ రేట్లు, టేబుల్స్ G.O.Ms.No. 8 dated 22.02.2021 విడుదల-Click Here

బదిలీలు - స్టే కారణంగా మున్సిపల్ పరిధి పాఠశాలల ఖాళీలను ఎంచుకోలేని పరిస్థితి - వివాదం ముగిసినందున ఆప్షన్ అవకాశం ఇవ్వాలన్న టీచర్స్ కోరికను - నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేసిన డైరెక్టర్-Click Here

నాడు-నేడులో పాఠశాలల అన్ని పనులను ఫిబ్రవరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కానీ.. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు అన్ని పనులు పూర్తయింది కేవలం 39.67శాతమే. పాఠశాలలకు రంగులు వేసేందుకు మార్చి వరకు సమయం ఉండగా, ఇప్పటికీ 2.24% బడులకే రంగులు వేశారు. తాగునీటి ట్యాంకులు, విద్యార్థులు, సిబ్బంది కూర్చునేందుకు డ్యూయల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ చాక్‌బోర్డుల కొనుగోలుకు కేంద్రీయ టెండర్లు నిర్వహించారు. గుత్తేదారులు వీటి సరఫరాలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటివరకు 4.41% బడులకే సామగ్రి అందింది. తాగునీటి పనులు 19.28శాతమే పూర్తయ్యాయి. మొదట్లో కొన్ని చోట్ల ఇసుక కొరత, మరికొన్ని చోట్ల సిమెంటు సరఫరాలో ఆలస్యమైంది. మొదటి దశ పనులు పెండింగ్‌లో ఉండగానే ఏప్రిల్‌ నుంచి రెండో విడత చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :