Monday, February 22, 2021

JEE Main 2021: రేపటి నుంచే జేఈఈ మెయిన్ పరీక్షలు-విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు తప్పక తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు



Read also:

JEE Main 2021: రేపటి నుంచే జేఈఈ మెయిన్ పరీక్షలు-విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు తప్పక తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు

  • జేఈఈ మెయిన్ 2021 మొదటి సెషన్ పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మొదటి సెషన్ పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.
  • ఇప్పటికే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inలో విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
  • అయితే జేఈఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఈ కింది డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటి వివరాలివే
  • అయితే జేఈఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఈ కింది డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటి వివరాలివే.
  • JEE Main Admit Card: అభ్యర్థులు తమ వెంట A4 సైజ్ పేపర్ పై ప్రింట్ చేసిన జేఈఈ అడ్మిట్ కార్డును వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
  • Self-Declaration Form: హాల్ టికెట్ పైనే డిక్లరేషన్ ఫామ్ ప్రింట్ చేసి ఉంటుంది. దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి లేదని తెలిపే డిక్లరేషన్ పై అభ్యర్థులు సంతకం చేయాల్సి ఉంటుంది.
  • Passport Size Photo: అభ్యర్థులు తమ వెంట పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫామ్ లో అప్ లోడ్ చేసిన ఫొటో మనం వెంట తీసుకెళ్లే ఫొటో రెండు సేమ్ ఉండాలి. ఈ ఫొటోను పరీక్ష సమయంలో అటెండెన్స్ షీట్ పై పేస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • Valid Photo ID: అభ్యర్థులు ప్రభుత్వంచే జారీ చేయబడిన ఏదైనా ఓ ఫొటో ఐడీని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. PAN Card/ Driving Licence/ Voter ID/ Passport/ Aadhaar Card / Ration Cardలో ఏదో దాన్ని వెంట తీసుకెళ్లొచ్చు. ఫొటో ఐడీ తప్పనిసరిగా ఒరిజనల్ అయి ఉండాలి. గడువు ముగిసిన గుర్తింపు కార్డులను అనుమతించరు.
  • PwD Certificate: PwD కేటగిరీకి చెందిన అభ్యర్థులు సంబంధిద ధ్రువపత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :