Thursday, February 18, 2021

Health Benefits of Raisins - Grapes



Read also:

Health Benefits of Raisins - Grapes

సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభించే పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి. అయితే ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చూడటానికి ఎంతో చిన్నవిగా ఉండే ఈ పండ్లు తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా.. రుచిగా ఉంటాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో ద్రాక్ష పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇందులోని విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు మీ దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. అయితే ద్రాక్ష పండ్లనే అలాగే తినడం కాకుండా ఎండబెట్టి కూడా తినవచ్చు. ఎండు ద్రాక్ష లేదా కిస్ మిస్ కూడా తినేందుకు చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య పోషక విలువల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎండుద్రాక్షతో పోలిస్తే ద్రాక్షలో ఎక్కువ నీరు ఉంటుంది.

ద్రాక్షలో 80.54% నీరు ఉంటే, ఎండుద్రాక్షలో 15.43% నీరు ఉంటుంది. ద్రాక్షతో పోలిస్తే ఎండుద్రాక్షలో మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండూ మీకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే. అయితే పోషకాల విషయంలో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్ష, ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలను పరిశీలిస్తే.

ద్రాక్ష, ఎండు ద్రాక్షలో పోషకాలు

ఎండు ద్రాక్ష            (100g)       ద్రాక్ష (100g)

నీరు                            15.43%        80.54%

క్యాలరీలు                    299 g       69g

ప్రోటీన్                       3.07g       0.72g

ఫ్యాట్                        0.46g       0.16g

కార్భోహైడ్రేట్           79.18g       18.10g

ఫైబర్                      3.70g       0.90g

షుగర్                      59.19g      15.48g

క్యాల్షియం              50g            10g

ఐరన్                    1.88g         0.36g

మెగ్నీషియం         32g              7g

విటమిన్ సి          2.30g         3.20g

విటమిన్ ఎ           0g                03g

ద్రాక్ష ప్రయోజనాలు

1. ద్రాక్షలోని పోషకాలు మీ కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

2. ఇది హృదయ సంబంధ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

3. డయాబెటిస్‌తో బాధపడేవారికి చక్కటి పరిష్కారం చూపిస్తాయి.

ఎండు ద్రాక్ష ప్రయోజనాలు

1. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

2. ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

3. ఎండుద్రాక్ష మీ కడుపులోని పేగులకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :