Saturday, February 20, 2021

Fish Health Benefits



Read also:

Health Benefits of Fish: చేపలు పెరిగేకొద్దీ వాటిలో కొవ్వు ఎక్కువవుతూ ఉంటుంది. మరి పెద్ద చేపల్ని తినవచ్చా? లేక చిన్నవే తినడం మంచిదా? నిపుణుల్ని అడిగేద్దాం.

బాగా పెరిగిన.కొవ్వుపట్టి ఉన్న చేపల్ని వారానికి నాలుగుసార్లు తింటే.వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు.గుండె జబ్బులు రాకుండా ఆపుతుందని ఓ పరిశోధనలో తేలింది.

పెద్ద పెద్ద చేపల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ (HDL).పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్.HDLను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల పెద్ద పెద్ద చేపల్ని తినమని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌లాండ్ చెబుతోంది.

జర్నల్ మాలిక్యూలర న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్‌లో ఈ పరిశోధన వివరాల్ని రాశారు. ఇందులో 100 మంది ఫిన్‌లాండ్ మగాళ్లు, మహిళలూ పాల్గొన్నారు. వాళ్ల వయసు 40 నుంచి 72 ఏళ్ల దాకా ఉంది. వాళ్లందరికీ గ్లూకోజ్ లెవెల్స్ రకరకాలుగా ఉన్నాయి.

వాళ్లను 4 గ్రూపులుగా విభజించి.12 వారాలపాటూ పరిశోధన చేశారు. వాళ్లలో కొందరిని మాత్రమే పెద్ద పెద్ద చేపల్ని తినమని చెప్పారు. కొందర్ని చిన్న చేపలు తినమని చెప్పారు. ఆ తర్వాత వాళ్లను టెస్ట్ చెయ్యగా.పెద్ద చేపలు తినేవారిలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. అది వాళ్ల గుండెను కాపాడేస్తోంది. చిన్న చేపలు తినే వాళ్లలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.

కాబట్టి.తూకంలో తక్కువ వచ్చినప్పటికీ.పెద్ద చేపల్నే కొనుక్కోవడం మేలు. కావాలంటే చిన్న ముక్కలుగా కోయించుకొని.అందరూ తినవచ్చు. అదే చిన్న చేపల్ని ఎన్ని కొనుక్కున్నా వాటిలో HDL ఎక్కువ లేనప్పుడు మనకు ప్రయోజనం ఎక్కువ కలగదన్నది ఈ పరిశోధన సారాంశం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :