Thursday, February 11, 2021

Fastag information



Read also:

Fastag: వాహనదారులకు అలర్ట్-ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవడానికి 5 రోజులే గడువు

మీ వాహనానికి ఫాస్‌ట్యాగ్ తీసుకున్నారా? ఫాస్‌ట్యాగ్ తీసుకోవడానికి మరో 5 రోజులే గడువుంది. ఫిబ్రవరి 15 తర్వాత హైవేలపై ప్రయాణించే వాహనాలకు ఫాస్‌ట్యాగ్ ఉండాల్సిందే.

1. ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల డెడ్‌లైన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... 2021 ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI.

2. రహదారులపై టోల్ ప్లాజాల దగ్గర 2021 జనవరి 1 నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుమతించమని గతంలోనే NHAI స్పష్టం చేసింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ల ద్వారా పేమెంట్స్ 75-80% జరుగుతున్నాయి. అంటే మిగతా లావాదేవీలు నగదు ద్వారా జరుగుతున్నాయి.

3. ఫిబ్రవరి 15 నుంచి 100 శాతం క్యాష్ లెస్ టోల్ ఫీజ్ కలెక్షన్ లక్ష్యంగా పెట్టుకుంది NHAI. నగదు లావాదేవీలు లేకుండా చేసేందుకు టోల్ ప్లాజాల్లో అన్ని లేన్లను ఫాస్టాగ్‌ లేన్లుగా మారుస్తోంది. అంటే ఫోర్ వీలర్ టోల్ ప్లాజా దాటాలంటే వాహనానికి తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ఉండాల్సిందే. లేకపోతే సాధారణ ఛార్జీల కన్నా రెట్టింపు ఛార్జీలు చెల్లించకతప్పదు.

4. టోల్‌ గేట్ల దగ్గర టోల్ ఫీజును సులభంగా వసూలు చేయడంతో పాటు, రద్దీ తగ్గించాలన్న లక్ష్యంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ ఫాస్ట్‌ ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ఏర్పాటు చేసింది.

5. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఈ లేన్ల నుంచి ఆగకుండా వెళ్లిపోవచ్చు. దీని వల్ల టోల్ ప్లాజాల దగ్గర రద్దీ తగ్గుతోంది. అందుకే దేశంలోని అన్ని టోల్ ప్లాజాల దగ్గర లేన్లను 100 శాతం ఫాస్టాగ్ లేన్లుగా మార్చాలన్నది NHAI లక్ష్యం. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ ఉంటేనే ఇది సాధ్యమవుతోంది. 

6. అందుకే వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాలని కేంద్రం కోరుతోంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ తీసుకోని వారికి 2021 ఫిబ్రవరి 15 వరకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేట్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. 

7. వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. వాహనదారుల సేవింగ్స్ అకౌంట్ లేదా వ్యాలెట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది.

8. టోల్ ఛార్జీ చెల్లించేందుకు వాహనదారులు వాహనాన్ని టోల్ ప్లాజా దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్‌లను టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, బ్యాంకుల దగ్గర తీసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్ కూడా ఫాస్ట్ ట్యాగ్స్ అమ్ముతుంటాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :