Sunday, February 21, 2021

Extra time for 10th exams



Read also:

  • పది పరీక్షకు అదనపు సమయం ఉంది
  • త్వరలో సవరణ ఉత్తర్వులు

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు 3.15గంటల సమయం ఇచ్చేందుకు త్వరలో సవరణ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అర్ధ గంట సమయం పెంచేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో శనివారం ‘అదనపు సమయం లేదా!’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. విద్యాశాఖ మంత్రి సురేష్‌ ప్రకటించినట్లే వంద మార్కులకు నిర్వహించే అయిదు సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని పేర్కొన్నారు. సామాన్య శాస్త్రంలో పేపర్‌-1(భౌతిక, రసాయన శాస్త్రం), పేపర్‌-2 (జీవశాస్త్రం) విడివిడిగా 50మార్కులకు పరీక్షలు ఉన్నందున ఈ రెండింటికి 2.45గంటల సమయమే ఉంటుంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :