More ...

Friday, February 19, 2021

ESIC Benefits



Read also:

ESIC Benefits: ఈఎస్ఐ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు కొత్త రూల్స్

ఈఎస్ఐ ఉన్నవారికి శుభవార్త. ఈఎస్ఐ బెనిఫిట్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకటిచింది. మారిన రూల్స్ ఈఎస్ఐ కార్డు హోల్డర్స్‌కి ఎలా ప్రయోజనం లభిస్తుందో తెలుసుకోండి.

1. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC స్కీమ్ ద్వారా ఈఎస్ఐ కార్డు ఉన్నవారికి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ బెనిఫిట్స్ విషయంలో పలు మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. 

2. ఈఎస్ఐ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని బెనిఫిట్స్‌ అందించేందుకు కేంద్ర కార్మిక శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. దగ్గర్లో ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీ, ఇన్స్యూర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ లేకపోతే ఈఎస్ఐ కార్డు హోల్డర్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవచ్చు. 

3. ఈఎస్ఐ ఆస్పత్రులు అన్ని చోట్లా ఉండవు. దీంతో ఈఎస్ఐ కార్డు హోల్డర్లకు చికిత్స చేయించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉచితంగా చికిత్స కావాలంటే దూరంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది.

4. దూరం వెళ్లే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలి. దీంతో ఈఎస్ఐ కార్డు ఉన్నా వృథాగా మారుతోంది. అందుకే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా ఈఎస్ఐ వర్తించేలా కొత్త రూల్స్ ప్రకటించింది కేంద్ర కార్మిక శాఖ.

5. సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉంటే అక్కడే చికిత్స చేయించుకోవాలి. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నా, ఇన్స్యూర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నా చికిత్స చేయించుకోవచ్చు. కానీ 10 కిలోమీటర్ల పరిధిలో ఇవేమీ అందుబాటులో లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవచ్చు.

6. అంటే 10 కిలోమీటర్ల పరిధిలో ఈఎస్ఐసీ వైద్య సదుపాయాలు లేకపోతేనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స వర్తిస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్ లేదా డిస్పెన్సరీ నుంచి ఎలాంటి రిఫరల్ లేకుండానే ఈఎస్ఐసీ ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో ఈఎస్ఐ కార్డుహోల్డర్లు వైద్య సాయం పొందొచ్చు.

7. ఇందుకోసం ఈఎస్ఐ లబ్ధిదారులు ఈఎస్ఐ ఇ-పెహచాన్ కార్డ్ లేదా హెల్త్ పాస్‌బుక్‌తో పాటు ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్లాలి. వివరాలన్నీ ఇచ్చి క్యాష్‌లెస్ మెడికల్ కన్సల్టేషన్ పొందొచ్చు. ఓపీడీ సర్వీసులు కూడా పొందొచ్చు.

8. ఓపీడీ కన్సల్టేషన్‌లో సూచించిన మెడిసిన్‌ కొంటే రీఇంబర్స్‌మెంట్ కోరొచ్చు. ఇందుకోసం దగ్గర్లోని డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీస్-DCBO లేదా రీజనల్ ఆఫీస్‌లో దరఖాస్తు చేయాలి.

9. ఒకవేళ ఆస్పత్రిలో అడ్మిట్ చేయాల్సి ఉంటే సంబంధిత ఆస్పత్రి ఈఎస్ఐ నుంచి 24 గంటల్లో ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకుంటుంది. ఆ తర్వాత లబ్ధిదారులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :