Monday, February 15, 2021

EPF Account



Read also:

EPF Account | మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? అందులో దాచుకున్న డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా? ఈపీఎఫ్ అకౌంట్‌లో బ్యాంకు అకౌంట్ వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు రావు. ఈ డీటైల్స్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేయడానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయడంలో సమస్యలు వస్తాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

2. అందుకే ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అకౌంట్‌లో మార్పులు ఉంటే అప్‌డేట్ చేయాలి. గతంలో ఈ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది.

3. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో సింపుల్‌గా బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చొచ్చు. ఇందుకోసం

ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.

4. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి. ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూలో KYC పైన క్లిక్ చేయండి. ఏ అకౌంట్ నెంబర్ అప్‌డేట్ అయి ఉందో ఓసారి చెక్ చేయండి. ఇప్పుడు వాడుతున్న అకౌంట్ నెంబర్ ఉంటే మార్చాల్సిన అవసరం లేదు.

5. కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. మీ ఎంప్లాయర్ నుంచి అప్రూవల్ లభించిన తర్వాత కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

6. ఇక ఈపీఎఫ్ఓ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి చెందిన 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖాతాదారుల ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ క్రెడిట్ అవుతోంది. మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ క్రెడిట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :